నెట్‌లో నెగ్గడం సులువే!

నేషనల్ ఎలిజిబిలిటి టెస్ట్ (నెట్) పరీక్ష ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే విద్యార్థులకు శుభవార్త. నోటిఫికేషన్ రానే వచ్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెంటనే ఆలోచించాల్సిన విషయం ప్రిపరేషన్. ఏమేం పుస్తకాలు చదవాలి, ఎన్ని గంటలు చదవాలి అనే దానిపై అవగాహన ఉండాలి. వారికోసం ఈ ప్రత్యేక కథనం. దేశంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల్ల, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌ల అర్హతకు నిర్వహించే యూజీసీ నెట్ ప్రకటన వెలువడింది! తొలిసారిగా ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్షగా జరగబోతోంది. […]

నేషనల్ ఎలిజిబిలిటి టెస్ట్ (నెట్) పరీక్ష ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే విద్యార్థులకు శుభవార్త. నోటిఫికేషన్ రానే వచ్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెంటనే ఆలోచించాల్సిన విషయం ప్రిపరేషన్. ఏమేం పుస్తకాలు చదవాలి, ఎన్ని గంటలు చదవాలి అనే దానిపై అవగాహన ఉండాలి. వారికోసం ఈ ప్రత్యేక కథనం.

దేశంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల్ల, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌ల అర్హతకు నిర్వహించే యూజీసీ నెట్ ప్రకటన వెలువడింది! తొలిసారిగా ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్షగా జరగబోతోంది. ప్రాథమికాంశాలపై పట్టు పెంచుకుని, అకడమిక్ పుస్తకాలు శ్రద్ధగా అధ్యయనం చేస్తే నెట్ లో నెగ్గడం సులువే! నెట్‌కు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు పోస్టుగ్రాడ్యుయేషన్‌లో సంబంధిత సబ్జెక్టుల్లో 55% మార్కులతో ఉత్తీర్ణులైవుండాలి. చివరి సంవత్సరం పరీక్షలు రాసే అభ్యర్థులు కూడా అర్హులే. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/దివ్యాంగులు 50% మార్కులు పొందినా అర్హులే.
అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగానికి దరఖాస్తు చేసుకునేవారికి గరిష్ఠ వయసు పరిమితి నిబంధన లేదు. జేఆర్‌ఎఫ్ దరఖాస్తుదారులకు 01.12.2018 నాటికి 30 సం.మించి ఉండకూడదు. రిజర్వేషన్ వర్గాలకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్)కు అర్హత సాధించినవారు మూడు సంవత్సరాల కాల పరిమితిలో ఉన్నత విద్య, పరిశోధన సంస్థలలో ప్రవేశం పొంది ఫెలోషిప్స్ పొందవచ్చు.దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా www. nta.ac.in , www. ntanet. nic.in 1-9—2018 నుంచి 30-09-2018 వరకు పంపుకోవచ్చు.
ఫీజును 1-10-2018 వరకూ చెల్లించవచ్చు.
పరీక్ష తేదీలు: 09-12-2018 నుంచి 23-12-2018
పరీక్ష ఫలితాల ప్రకటన: 10-01-2019.
పేపర్లవారీగా ప్రిపరేషన్…
పేపర్-1: అభ్యర్థిలోని బోధన, పరిశోధనకు సంబంధించిన అభిరుచి (ఆప్టిట్యూడ్)ను ఇందులో పరిశీలిస్తారు. దీనిలో ప్రధానంగా 10 విభాగాలుంటాయి. బోధన, పరిశోధనాభిరుచి విభాగంలో బోధన స్వభావం, లక్ష్యా లు, లక్షణాలు, అభ్యాసకుడి లక్షణాలు, ప్రభావవంతమైన బోధన కారకాలు, బోధనా పద్ధతులు ఉపగమాలు, వ్యూహాలు, మదింపు, మూల్యాంకన విధానం ముఖ్యం. అలాగే పరిశోధన లక్షణాలు, లక్ష్యాలు, పరిశోధనలో ప్రేరణ కారకాలు, పరిశోధన రకాలు, పరిశోధన ఉపగమాలు, పరిశోధకులు ఎదుర్కొనే సమస్యలు, ఉత్తమ పరిశోధకుల లక్షణాలు, సాంకేతిక సాధనా లు మొదలైనవి సూక్ష్మస్థాయిలో అభ్యసించాలి.
రీడింగ్ కాంప్రహెన్షన్‌లో పాసేజ్ విషయాన్ని సమగ్రంగా అవగాహన చేసుకొని, సమాధానాలు గుర్తించాలి. కమ్యూనికేషన్‌లో దాని స్వభావం, లక్షణాలు, రకాలు, అవరోధాలు, ప్రభావవంతమైన తరగతిగది సమాచారం ముఖ్యం. రీజనింగ్‌కు సంబంధించి నంబర్ సీరీస్, లెటర్ సిరీస్, రక్తసంబంధాలు, వర్గీకరణలు చూసుకోవాలి.
పర్యావరణ విభాగంలో కాలుష్య కారకాలు, మానవ జీవనంపై ప్రభావం, సహజ ఇంధన వనరులు, అవరోధాలు చూసుకోవాలి. ఉన్నత విద్యలో నియత విద్య, దూర విద్య, వృత్తి, సాంకేతిక విద్య, విలువల ఆధారిత విద్య, విద్యారంగంలో పరిపాలనకు సంబంధించిన విషయాలు చదవాలి.
పేపర్-2: దీనిలో అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్టుపై పీజీ స్థాయి ప్రశ్నలుంటాయి. అందుకే పీజీ పాఠ్యాంశాలపై దృష్టి కేంద్రీకరించాల్సి వుంటుంది. ఈ విభాగంలో భావనలపై వున్న పరిజ్ఞానం, అవగాహన, అన్వయం ఆధారంగా సమాధానాలు రాబట్టేలా ప్రశ్నలుంటాయి. కాన్సెప్ట్‌పై, సూత్రాలపై అవగాహనతో అభ్యసన కొనసాగాలి.
గమనించాల్సినవి…
* రాతపరీక్షకు నిర్దేశించిన సిలబస్ కోసం ప్రామాణిక పుస్తకాలు, రెఫరెన్స్ మెటీరియల్‌ను అనుసరించాలి. * గత ప్రశ్నపత్రాల విశ్లేషణ ఆధారంగా ముఖ్యమైన టాపిక్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
*మార్కుల ప్రాధాన్యానికి అనుగుణంగా సబ్జెక్ట్‌లోని అంశాలకు సముచిత సమయాన్ని కేటాయించుకోవాలి. * ప్రతి టాపిక్ నుంచీ ప్రశ్నలు తప్పకుండా వస్తాయి. కాబట్టి సబ్జెక్ట్‌ను స్థూలంగా కాకుండా సూక్ష్మస్థాయిలో దృష్టి కేంద్రీకరించి అధ్యయనం చేయాలి. * ప్రతి రోజు/వారం కాల నిర్ణయ పట్టికను కచ్చితంగా అనుసరించే ప్రయత్నం చేయాలి. * నిర్దిష్ట సమయం లో వేగంగా, కచ్చితమైన సమాధానాలు రాయాల్సి వుంది. * ప్రాథమిక భావనలే చాలా కీలకం. ఒక భావన అభ్యసించాక దాన్ని వివిధ కోణాల్లో ఎలా ప్రశ్నించవచ్చునో విశ్లేషించుకోవాలి. దానికి అనుగుణంగా పరీక్షలకు సిద్ధం కావాలి.
* డాటా అనాలిసిస్, గ్రాఫ్స్, పైచార్ట్ తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు సరాసరి, శాతాలు, నిష్పత్తులు, లాభ-నష్టాలు భావనలపై పట్టు సాధించాలి. వేగంగా సూక్ష్మీకరణలు చేయాల్సి ఉన్నందున సాధ్యమైనంత ఎక్కువగా మాదిరి సమస్యల సాధన చేయటం మేలు. * తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తున్నందున అవగాహన కోసం కంప్యూటర్‌పై మాదిరి పరీక్షల సాధన తప్పనిసరి. * నమూనా పరీక్షలు ఫైనల్ పరీక్షను ఫలవంతంగా రాసేందుకు దోహదపడతాయి. వీలైతే వారానికి/ నెలకు పూర్తి చేసిన సిలబస్‌పై ఆన్‌లైన్‌లో మోడల్ టెస్ట్‌లు సాధన చేయడం మంచిది. వివాదాస్పద ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వకూడదు. అఖిల భారతస్థాయిలో జరిగే ఈ పోటీ పరీక్షకు ప్రణాళికాబద్ధంగా అభ్యాసం కొనసాగిస్తే విజయం తథ్యం!
పరీక్ష పద్ధతి …
యూజీసీ నెట్‌లోని రెండు పేపర్లూ బహుళైచ్ఛిక ప్రశ్నల విధానంలో ఉంటాయి.
పేపరు-1 అన్ని సబ్జెక్టులవారికి ఉమ్మడిగా ఉంటుంది.
పేపర్-2లో ఎంపిక చేసుకొన్న సబ్జెక్టు ఉంటుంది.
* రెండు పేపర్లలోనూ తప్పనిసరిగా జనరల్ అభ్యర్థులు 40%, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీ/ట్రాన్స్ జెండర్ కేటగిరీలవారు 35% మార్కులు పొందాలి. పొందిన మార్కుల ఆధారంగా సబ్జెక్టుల వారీగా అర్హత సాధించినవారి జాబితా ప్రకటిస్తారు.
మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 26 పట్టణాలూ, నగరాల్లో పరీక్ష జరుగుతుంది.

Related Stories: