నేపాల్ సందర్శించాలని మోడీకి ఆహ్వానం

  ఖాట్మండు : తమ దేశంలో పర్యటించాలని ప్రధాని నరేంద్ర మోడీని నేపాల్ ప్రధానమంత్రి కెపి సింగ్ ఓలి ఆహ్వానించారు. పరస్పరం క్రమబద్ధంగా సందర్శించడం వల్లనే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవుతాయని పేర్కొన్నారు. గురువారం రెండోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు, బిమ్‌టెక్ దేశాల నేతలతో కలిసి ఓలి రెండు రోజుల పాటు దేశంలో పర్యటించారు. తన పర్యటనలో మోడీతో సమావేశమైన ఆయన శుక్రవారం నేపాల్‌కు తిరిగి వెళ్లారు. ద్వైపాక్షిక సంబంధాలను అత్యున్నత స్థితికి తీసుకెళ్లేందుకు ఇరువురు […] The post నేపాల్ సందర్శించాలని మోడీకి ఆహ్వానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఖాట్మండు : తమ దేశంలో పర్యటించాలని ప్రధాని నరేంద్ర మోడీని నేపాల్ ప్రధానమంత్రి కెపి సింగ్ ఓలి ఆహ్వానించారు. పరస్పరం క్రమబద్ధంగా సందర్శించడం వల్లనే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవుతాయని పేర్కొన్నారు. గురువారం రెండోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు, బిమ్‌టెక్ దేశాల నేతలతో కలిసి ఓలి రెండు రోజుల పాటు దేశంలో పర్యటించారు. తన పర్యటనలో మోడీతో సమావేశమైన ఆయన శుక్రవారం నేపాల్‌కు తిరిగి వెళ్లారు. ద్వైపాక్షిక సంబంధాలను అత్యున్నత స్థితికి తీసుకెళ్లేందుకు ఇరువురు నేతలు నిబద్ధతను వ్యక్తం చేశారు. ఓలి ఆహ్వానాన్ని మోడీ ఆమోదించినట్లు నేపాల్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తమ నాయకత్వంలో ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై ఇరువురు నేతలు సంతోషం వ్యక్తం చేసినట్లు పేర్కొంది.

Nepal all set to welcome PM Narendra Modi

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నేపాల్ సందర్శించాలని మోడీకి ఆహ్వానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: