ప్రతి తల్లిదండ్రులు, పిల్లలు చూడాల్సిన సినిమా

  ‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న షకలక శంకర్ నటించిన తాజా చిత్రం ‘నేనే కేడీ నం.1’. ఆర్‌ఏ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.డి. రౌఫ్ సమర్పణలో జాని స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముస్కాన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని ఈనెల 26న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం ట్రైలర్‌ను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కళ్యాణ్ […] The post ప్రతి తల్లిదండ్రులు, పిల్లలు చూడాల్సిన సినిమా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న షకలక శంకర్ నటించిన తాజా చిత్రం ‘నేనే కేడీ నం.1’. ఆర్‌ఏ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.డి. రౌఫ్ సమర్పణలో జాని స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముస్కాన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని ఈనెల 26న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం ట్రైలర్‌ను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “ట్రైలర్ చాలా బావుంది. ఓ చక్కటి కథాంశానికి మాస్ ఎలిమెంట్స్ జోడించి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని రూపొందించారు.

షకలక శంకర్‌కు మంచి గుర్తింపు ఉంది కాబట్టి ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది”అని అన్నారు. దర్శక నిర్మాత జాని మాట్లాడుతూ “మంచి ఎంటర్‌టైనర్‌తో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. ప్రస్తుతం సమాజంలో పిల్లలు చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారంటే దానికి కారణం తల్లిదండ్రులు కూడా. నేటి బిజీ లైఫ్‌లో తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోకుండా వారికి పూర్తి స్వేచ్ఛనిస్తూ గాలికి వదిలేస్తున్నారు. ఈ క్రమంలో యువత పెడదోవ పడుతోందనే అంశాన్ని మా సినిమాలో చూపించాం. ప్రతి తల్లిదండ్రులు, పిల్లలు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. షకలక శంకర్ క్యారెక్టర్ మూడు షేడ్స్‌తో ఉంటుంది. ఈ సినిమాను ఈనెల 26న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అజయ్ పట్నాయక్ పాల్గొన్నారు.

Nene kedi No. 1 movie Trailer Release

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రతి తల్లిదండ్రులు, పిల్లలు చూడాల్సిన సినిమా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: