పెళ్లికి సిద్ధమవుతున్న నయన్?

Nayanthara getting ready for marriage

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార వరుసగా పెద్ద సినిమాల ఆఫర్లు దక్కించుకుంటూ రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటోంది. దాదాపు పన్నెండేళ్లకు పైనే సినిమాలలో అలరిస్తున్న నయన్.. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యమిచ్చింది. గత కొన్నేళ్లుగా తన పంథా మార్చేసింది. గ్లామర్ షో కాస్త తగ్గించేసి నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఓకే చేస్తోంది. సినిమాల పరంగా టాప్‌లో ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితం విషయంలో మాత్రం ఆమెకు సంతృప్తి లేదనే చెప్పాలి. ఈ మధ్య తన ప్రేమ, పెళ్లి విషయాలతో నయనతార తరచుగా వార్తల్లో నిలుస్తుంది.

అయితే సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న ఈ భామ వ్యక్తిగత జీవితంలో రెండుసార్లు విఫలమైంది. ఇప్పుడు నయన్ జీవితంలోకి ఫిల్మ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రవేశించాడు. ‘నానుమ్ రౌడీ దాన్’ అనే సినిమా షూటింగ్ సమయంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. అప్పటి నుంచి హాలీడే ట్రిప్‌లకు వెళ్తూ తరచూ కెమెరాల కంటికి చిక్కుతూనే ఉన్నారు. ఇంతలో విఘ్నేష్‌తో నయన్ పెళ్లి అని జోరుగా ప్రచారం జరుగుతోంది.

తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి నయనతార సంచలన నిర్ణయం తీసుకుందట. విఘ్నేష్ కుటుంబ సభ్యులు పెళ్లి గురించి ఒత్తిడి పెంచడంతో నయన్ ఓకే అన్నట్లు ఓ వార్త కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇక ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతుందని సోషల్‌మీడియాలో హల్‌చల్ నడుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పెళ్లికి సిద్ధమవుతున్న నయన్? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.