32వ జిల్లాగా నారాయణపేట

  11 మండలాలతో జిల్లా ఏర్పాటు చేస్తూ జివో 19 విడుదల ఆదివారం ఉదయం 6.32కు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల ప్రారంభోత్సవం నెరవేరిన పేట ప్రజల చిరకాల వాంఛ కోయిలకొండ మండలం మహబూబ్‌నగర్‌లోనే ఎన్నికల హామీని నిలబెట్టుకున్న సిఎం కెసిఆర్ మన తెలంగాణ/నారాయణపేట: కర్నాటక సరిహద్దుల్లో ఉన్న నారాయణపేటను జిల్లా కేంద్రంగా మార్చాలన్న ప్రజల ఆకాంక్ష మేరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని సిఎం కెసిఆర్ నిలబెట్టుకున్నారు. 11మండలాలతో నారాయణపేట జిల్లాగా ఏర్పాటు చేస్తూ శనివారం రాష్ట్ర రెవెన్యూ […]

 

11 మండలాలతో జిల్లా ఏర్పాటు చేస్తూ జివో 19 విడుదల
ఆదివారం ఉదయం 6.32కు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల ప్రారంభోత్సవం
నెరవేరిన పేట ప్రజల చిరకాల వాంఛ
కోయిలకొండ మండలం మహబూబ్‌నగర్‌లోనే
ఎన్నికల హామీని నిలబెట్టుకున్న సిఎం కెసిఆర్

మన తెలంగాణ/నారాయణపేట: కర్నాటక సరిహద్దుల్లో ఉన్న నారాయణపేటను జిల్లా కేంద్రంగా మార్చాలన్న ప్రజల ఆకాంక్ష మేరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని సిఎం కెసిఆర్ నిలబెట్టుకున్నారు. 11మండలాలతో నారాయణపేట జిల్లాగా ఏర్పాటు చేస్తూ శనివారం రాష్ట్ర రెవెన్యూ శాఖ జివో 19 విడుదల చేసింది. జిల్లాగా ఏర్పాటు చేస్తున్నట్లు డిసెంబర్ 30, 2018న ప్రభుత్వం ప్రాధమి క నోటిఫికేషన్ జారీ చే సింది. నారాయణపేట డివిజన్‌లోని 11మండలాలతో పాటు మహబుబ్‌నగర్ జిల్లాలోని కోయిలకొం డ మండలాన్ని పేట జిల్లాలో కలుపుతున్నట్లు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ కాగా చివరగా ఫైనల్ నోటిఫికేషన్‌లో కోయిలకొండను మహబుబ్‌నగర్‌లోనే ఉంచి నారాయణపేట డివిజన్‌లోని 11మడంలాలతో జిల్లాగా ఏర్పాటు చేస్తున్నట్లు జివో 19విడుదల అయింది. అధికారులు శనివారం కలెక్టర్ కార్యాలయాలను చూసి వెళ్ళారు. అయితే ఆ దివారం ఉదయం 6.32 నిమిషాలకు కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం, జెండా ఆవిష్కరణ, అలాగే ఉదయం 7గంలకు ఎస్పీ కార్యాలయాను అధికారు లు, ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవం చే యనున్నారు.

నారాయణపేట డివిజన్ నిజాం కాలంనుండి డివిజన్‌గా ఉంది. కాగా అపుడు డివిజన్‌ను తాలుకాగా పిలుస్తుండగా కర్నాటక రాష్ట్రంలోని కొన్ని గ్రామాలతో పాటు రంగారెడ్డి ప్రాతంలోని కొంత భాగాన్ని నిజాం రాజులు నారాయణపేట కేంద్రంగా పాలన కనసాగించారు. అయితే స్వాతంత్య్రం వచ్చిన తరువాత నిజాం పాలన నుండి ప్రభుత్వం విముక్తి చేయగా పేట డివజన్‌లోని కొన్ని గ్రామాలు కర్నాటకలో కలిసాయి. మరికొన్ని ప్రాంతాలు ఇతర జిల్లాలో కలపబడ్డాయి. ఇక్కడ 1952నుండి రెవెన్యూ రికార్డులు ఉన్నాయి. అప్పుడు తాలుకాగా ఉన్న పేట డివిజన్ పరిసర ప్రాంతాలలో అప్పట్లో బోదకాలు వ్యాధి ప్రజలకు సోకుతుండటంతో ప్రభుత్వం పేటను డివిజన్ కేంద్రంగా ఉంచి మక్తల్‌ను తాలుకాగా చేసి పేట మండలాలను మక్తల్‌లోనే ఉంచారు.

కర్నాటకకు సరిహద్దులో ఉండటంతో పాలకులు అభివృద్ధిపై దృష్టి సారించలేదు. నియోజకవర్గాల పునర్విభజన 2009లో కాగా తిరిగి నారాయణపేటను తిరిగి తాలుకాగా ప్రభుత్వం గుర్తించింది. అయినా అభివృద్ధి జరుగక పోవటం, సాగునీరు ఈప్రాంతనుండి వెళ్ళినా నీటిని రైతులకు ఇవ్వకపోవటంతో చాలామంది రైతులు, ప్రజలు జీవనోపాధిలేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తదుపరి ఇక్క డి ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ధృడసంకల్పంతో సాగునీటి ప్రాజెక్టులు తీసుకురావటానికి ప్రయత్నం చేశారు.

11మండలాలతో నేడు ప్రారంభం
నారాయణపేట జిల్లా 11మండలాలలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం జివో 19ని విడుదల చేసింది. నారాయణపేట, ధన్వాడ, మరికల్, దామరగిద్ద, మద్దూర్, కోస్గి, మక్తల్, ఊట్కూర్, మాగనూర్, కృష్ణ, నర్వ మండలలాలతో జిల్లా స్వరూపాన్ని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 5,04,653 జనాభా ఉండగా 2,33,689హెక్టార్లు భూస్వరూపం ఉంది. 5,77,445 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Narayanpet is the 32nd district

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: