పిలిస్తే పలికే నరసింహుడు

శ్రీలక్ష్మీ నృసింహుడు యోగ నారసింహుడుగా, ఉగ్ర నారసింహుడిగా రెండు అవతరాల్లో ఇక్కడ కొలువై ఉన్నాడు. ఉత్తర తెలంగాణాలో గోదావరి నదీ తీరాన ధర్మపురి ఉంది. గోదావరి నది ఇకడ దక్షిణవాహిని. ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్ర కలిగిన ఈ క్షేత్రం వైదిక విద్యలకు, సాహిత్యానికి పేరుపొందింది. ధర్మవర్మ అనే మహారాజు నృసింహుని గూర్చి తపస్సు చేశాడు. ఇది పితృకర్మలకు, కుజదోష నివారణకు ప్రసిద్ధి పొందిన క్షేత్రం. కరీంనగర్, హైదరాబాద్ నుండి ధర్మపురికి బస్సులున్నాయి. 42 కి.మీ దూరంలోని […] The post పిలిస్తే పలికే నరసింహుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

శ్రీలక్ష్మీ నృసింహుడు యోగ నారసింహుడుగా, ఉగ్ర నారసింహుడిగా రెండు అవతరాల్లో ఇక్కడ కొలువై ఉన్నాడు. ఉత్తర తెలంగాణాలో గోదావరి నదీ తీరాన ధర్మపురి ఉంది. గోదావరి నది ఇకడ దక్షిణవాహిని. ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్ర కలిగిన ఈ క్షేత్రం వైదిక విద్యలకు, సాహిత్యానికి పేరుపొందింది. ధర్మవర్మ అనే మహారాజు నృసింహుని గూర్చి తపస్సు చేశాడు. ఇది పితృకర్మలకు, కుజదోష నివారణకు ప్రసిద్ధి పొందిన క్షేత్రం. కరీంనగర్, హైదరాబాద్ నుండి ధర్మపురికి బస్సులున్నాయి. 42 కి.మీ దూరంలోని మంచిర్యాల సమీప రైల్వేస్టేషన్. జగిత్యాలకు 27 కి.మీలు.

మట్టపల్లిలోని స్వామిని అన్నాలయ్యగా ఆరాధిస్తారు. ఇక్కడ విరివిగా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. గర్భాలయానికి ముందు ఉన్న ఆరెచెట్టు (ముని గోరింట), ధ్వజస్తంభం, ఆంజనేయస్వామికి కలిపి 32 ప్రదక్షణలు చేస్తే కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల విశ్వాసం. దీనిని దర్శించిన వారికి యమబాధలుండవు. శంఖ చక్ర గద అభయహస్తాలతో కరాళదంష్ట్రికలతో, వక్ష స్థల కౌస్తుభంతో స్వామి చిద్విలాసంగా దర్శనమిస్తాడు. పక్కనే రాజ్యలక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది. ఆలయానికి తూర్పు వైపు కొండ, పడమరవైపు కృష్ణానది ఉంటాయి. తెలంగాణలోని హుజూర్‌నగర్‌కు 35 కి.మీ దూరంలో ఉందీ ఆలయం. నల్గొండ నుంచి రోడ్డురవాణా సౌకర్యం ఉంది.

స్తంభాద్రి

ప్రహ్లాదుణ్ణి కాపాడడానికి స్తంభం నుంచి వచ్చిన నరసింహమూర్తియే స్తంభాద్రి కొండగుహలో వెలిశాడు. కొండ స్తంభం ఆకారంలో ఉంటుంది. అందుకే ఆ పట్టణానికి స్తంభాద్రి అనే పేరు వచ్చింది. కాలక్రమంలో కంభం మెట్టు, ఖమ్మం అయ్యింది. స్తంభాద్రిపై సంవత్సరం పొడవునా నీటి నిల్వలు ఉంటాయి. కొండను రెండుగా చీల్చినట్లున్న ప్రాంతంలో అందమైన కొలను కనిపిస్తుంది. ఉగ్రరూపుడైన నరసింహుని శాంతింపజేయడానికి స్తంభాద్రిపై ప్రకృతి సిద్ధంగా నీరు ఊరుతూ ఉంటుంది. కొన్నిసార్లు కేవలం చెమ్మవంటి తడిమాత్రమే కాక ఏకంగా ప్రవాహంలాగా నీరు కొండమీది కొలను నుంచి గర్భగుడిలోని స్వామివారి విగ్రహాన్ని తడుపుతాయని అంటారు స్థానికులు. ఖమ్మం నరసింహస్వామిని పానకంతో అభిషేకం చేయడం ప్రత్యేకత.
హైదరాబాదు నుంచి 195 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 125 కిలోమీటర్లు.

Narasimha Swamy Jayanthi 2019

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పిలిస్తే పలికే నరసింహుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.