క్వార్టర్స్‌లో సెరెనా, ఒసాకా

టొరంటో: ప్రతిష్టాత్మకమైన రోజర్స్‌కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సెరెనా విలియమ్స్ (అమెరికా), నవొమి ఒసాకా (జపాన్) క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ రఫెల్ నాదల్ (స్పెయిన్), ఏడో సీడ్ ఫొబియో ఫొగ్నిని (ఇటలీ) ప్రిక్వార్టర్ ఫైనల్లో విజయం సాధించారు. మరోవైపు మహిళల విభాగంలో నాలుగో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ఒసాకా 76, 64తో స్వియాటెక్ (పోలండ్)ను ఓడించింది. ప్రారంభం […] The post క్వార్టర్స్‌లో సెరెనా, ఒసాకా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

టొరంటో: ప్రతిష్టాత్మకమైన రోజర్స్‌కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సెరెనా విలియమ్స్ (అమెరికా), నవొమి ఒసాకా (జపాన్) క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ రఫెల్ నాదల్ (స్పెయిన్), ఏడో సీడ్ ఫొబియో ఫొగ్నిని (ఇటలీ) ప్రిక్వార్టర్ ఫైనల్లో విజయం సాధించారు. మరోవైపు మహిళల విభాగంలో నాలుగో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ఒసాకా 76, 64తో స్వియాటెక్ (పోలండ్)ను ఓడించింది. ప్రారంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇద్దరు కూడా ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. దీంతో పోరు ఆసక్తికరంగా మారింది. కానీ, చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న ఒసాకా ముందంజ వేసింది.

మరో పోరులో 8వ సీడ్ సెరెనా 75, 64తో రష్యా క్రీడాకారిణి ఎకటరినా అలెగ్జాండ్రియాను ఓడించింది. ఈ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగింది. ఇద్దరు నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. కాగా, ఆఖరి వరకు నిలకడగా ఆడిన సెరెనా విజయాన్ని సొంతం చేసుకుంది. మరో పోటీలో హలెప్ జయభేరి మోగించింది. రష్యా స్టార్ కుజునెత్సొవాతో జరిగిన పోరులో హలెప్ 62, 61తో విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో నాదల్ 63, 64తో గ్యూడో పెల్లా (అర్జెంటీనా)ను ఓడించాడు. మరోవైపు ఫొగ్నిని 63, 75తో అడ్రియాన్ (ఫ్రాన్స్)ను ఓడించి ముందంజ వేశాడు.

Naomi Osaka and Serena Williams to meet in Toronto quarters

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post క్వార్టర్స్‌లో సెరెనా, ఒసాకా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: