గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ : మొక్కలు నాటిన డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి

 Nandini Reddy Participated In green India Challengeహైదరాబాద్ : టిఆర్ఎస్ ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కు దేశ వ్యాప్తంగా అపూర్వ స్పందన లభిస్తుంది. ఆయన చాలెంజ్ ను స్వీకరించి అన్ని రంగాల ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. ఈ క్రమంలో హీరో నాగశౌర్య విసిరిన చాలెంజ్ ను స్వీకరించి తెలుగు దర్శకురాలు నందినీ రెడ్డి శనివారం తన ఇంట్లో మొక్కలు నాటారు. సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ చాలెంజ్ వల్ల ప్రతి ఒక్కరు చైతన్యవంతులై మొక్కలు నాటుతున్నారని, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయనకు ధన్యవాదాలు అని నందినీరెడ్డి పేర్కొన్నారు. తాను ఈ చాలెంజ్ లో భాగమైనందుకు సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె హీరో నాగచైతన్య, సింగర్ మిక్కీ జే మేయర్, నటి లావణ్య త్రిపాఠీలకు చాలెంజ్ విసిరారు. తను చాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని ఆమె వారిని కోరారు.

 

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ : మొక్కలు నాటిన డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.