మహేష్‌కు బాలయ్య ఫోన్..?

Balakrishna with Mahesh Babu

ఎన్టీఆర్ బయోపిక్ రూపురేఖలు మారిపోతున్నాయి. దర్శకుడు క్రిష్ రంగ ప్రవేశంతో ఈ బయోపిక్ రేంజ్ పెరిగిపోతోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా(కథానాయకుడు, మహానాయకుడు) తీయాలని నిర్ణయించడం ఓ పెద్ద మలుపు. ఆ తర్వాత ఇక పాపులర్ స్టార్ కాస్ట్, థియేటర్ ఆర్టిస్టులను కలగలిపి సినిమా చేయాలనుకోవడం ఇంకో మలుపు. ఇక ఈ సినిమాలో ఏ పాత్రలను చూపించాలి, ఎవరిని తీసుకోవాలి అనే విషయాలను క్రిష్, బాలకృష్ణ కలిసి చూస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం జనరంజకంగా ఉండేందుకు బాలయ్య చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు. ఎన్టీఆర్ జీవితంలో ముడిపడి ఉన్న పాత్రలన్నింటికీ ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో చాలా మంది స్టార్స్ వచ్చి చేరారు.

విద్యాబాలన్, రానా, రకుల్ ప్రీత్ సింగ్, కళ్యాణ్ రామ్ ఇలా లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంది. ఇదిలాఉండగా మరోసారి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు పేరు తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్ లో ఈ సూపర్ స్టార్ ని నటింపజేసేందుకు చాలా రోజుల క్రితమే బాలకృష్ణ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రయత్నంలో భాగంగా మరో ముందడుగు పడ్డట్లు తాజా సమాచారం. మహేష్ ని ఎలాగైనా ఒప్పించాలని బాలయ్య డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ బయోపిక్ లో మహేష్ నటిస్తే సినిమా మరో స్థాయికి చేరుతుందనేది చిత్రయూనిట్ భావన. అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ పాత్ర కూడా కీలకం అని బాలయ్యతో పాటు దర్శకుడు క్రిష్ భావిస్తుండడంతో ప్రిన్స్ ను ఒప్పించే పనిలో బాలయ్య బాబు ఉన్నట్లు సమాచారం.

తాజాగా చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్‌ బాబుకు బాలయ్య ఫోన్ చేశారట. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో కృష్ణ పాత్రలో నటించాలని కోరారట. దీంతో త్వరలోనే తన నిర్ణయాన్ని చెబుతానని బాలయ్యతో మహేష్ చెప్పినట్లు తెలిసింది. ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తేలాల్సి ఉంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ మంచి స్నేహితులే అయినప్పటికీ వీరి మధ్య కొన్ని విభేదాలు ఉన్నట్లు వారితో కలిసి నటించిన సినీ పెద్దలు చెబుతుంటారు. అలాగే సినిమాల పరంగా కూడా వీరిద్దరి మధ్య పోటీ కొనసాగిన విషయం విదితమే. అలాంటి పాత్ర ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో ఉంటే ఆ కిక్కే వేరని, అందుకే తప్పనిసరిగా ఆ పాత్ర ఉండాలని బాలయ్య పట్టుబడుతున్నారట.

Nandamuri Balakrishna phone call to super star Mahesh?

Telangana Breaking News