టిడిపికి నామా రాజీనామా

ఖమ్మం : టిడిపి అగ్ర నేత నామా నాగేశ్వరరావు ఆ పార్టీని వీడారు.  కొంతకాలంగా  నామా టిడిపిపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మహాకూటమి తరపున ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. నాటి నుంచి ఆయన టిడిపి అధిష్ఠానం వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణలో టిడిపికి భవిష్యత్ లేదన్న […]

ఖమ్మం : టిడిపి అగ్ర నేత నామా నాగేశ్వరరావు ఆ పార్టీని వీడారు.  కొంతకాలంగా  నామా టిడిపిపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మహాకూటమి తరపున ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. నాటి నుంచి ఆయన టిడిపి అధిష్ఠానం వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణలో టిడిపికి భవిష్యత్ లేదన్న కారణంతో ఆయన కాంగ్రెస్, లేదా టిఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఇటీవల టిఆర్ఎస్ చీఫ్, సిఎం కెసిఆర్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తో భేటీ అయ్యారు. అయితే నామాను టిఆర్ఎస్ లో చేర్చుకునేందుకు కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నామాను పోటీలోకి దింపేందుకు కెసిఆర్ యోచన చేస్తున్నట్టు సమాచారం. టిఆర్ఎస్ లో నామా చేరిక వల్ల ఖమ్మంలో పార్టీ మరింత బలోపేతమవ్వనుందన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

Nama Nageswara Rao Resigns TDP

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: