టిఆర్ఎస్ లో చేరిన నామా

హైదరాబాద్ : టిడిపికి  రాజీనామా చేసిన నామా నాగేశ్వర్‌రావు గురువారం  టిఆర్‌ఎస్ లో చేరారు. టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో ఆయన టిఆర్‌ఎస్ లో చేరారు. నామా నాగేశ్వర్‌రావుకు కెటిఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నామాతో పాటు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వర్ణ కుమారి, అమర్‌నాథ్, ఖమ్మం జిల్లా టిడిపి అధ్యక్షుడు బ్రహ్మయ్య, మంచిర్యాల జిల్లా టిడిపి అధ్యక్షుడు శరత్‌బాబు  తదితరులు కూడా టిఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ  […]

హైదరాబాద్ : టిడిపికి  రాజీనామా చేసిన నామా నాగేశ్వర్‌రావు గురువారం  టిఆర్‌ఎస్ లో చేరారు. టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో ఆయన టిఆర్‌ఎస్ లో చేరారు. నామా నాగేశ్వర్‌రావుకు కెటిఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నామాతో పాటు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వర్ణ కుమారి, అమర్‌నాథ్, ఖమ్మం జిల్లా టిడిపి అధ్యక్షుడు బ్రహ్మయ్య, మంచిర్యాల జిల్లా టిడిపి అధ్యక్షుడు శరత్‌బాబు  తదితరులు కూడా టిఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ  కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఖమ్మం ఎంఎల్ఎ పువ్వాడ అజయ్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఇదిలా ఉండా ఖమ్మం లోక్ సభ టికెట్ ను నామాకు ఇచ్చేందుకు సిఎం కెసిఆర్ నిర్ణయించినట్టు సమాచారం.

Nama Nageswara Rao Joins TRS on Thursday

 

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: