సంక్షేమ పథకాలతోనే తెలంగాణ అభివృద్ధి : నామా

ఖమ్మం: ఖమ్మం జిల్లా తన కన్నతల్లితో సమానమని, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలపడంలో సిఎం కెసిఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని ఖమ్మం పార్లమెంట్ టిఆర్‌ఎస్ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని బైపాస్ రోడ్డులో గల రెస్టెన్ హోటల్‌లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధుసూదన్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చాలనే ఆకాంక్షతో కెసిఆర్ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో […]

ఖమ్మం: ఖమ్మం జిల్లా తన కన్నతల్లితో సమానమని, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలపడంలో సిఎం కెసిఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని ఖమ్మం పార్లమెంట్ టిఆర్‌ఎస్ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని బైపాస్ రోడ్డులో గల రెస్టెన్ హోటల్‌లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధుసూదన్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చాలనే ఆకాంక్షతో కెసిఆర్ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో రూ. 18వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి అటవీ అనుమతులతో పాటు ఇతర అనుమతులు కూడా లభించాయయని చెప్పారు. 2020 ఖరీఫ్ నాటికి రైతులకు సాగు నీరు అందించాలనే ప్రధాన ఆశయంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరతగతిన చేపడుతున్నారని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి కావాలని కోరుకునే వ్యక్తుల్లో తాను ఒకడినన్నారు. జిల్లా ప్రజలకు మరింత సేవ చేయాలనే ఆకాంక్షతో తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం కెసిఆర్ అమరణ దీక్ష చేసినప్పుడు, ఆ  అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని పట్టుబట్టిన వ్యక్తుల్లో తాను ఒకడినని నామా తెలిపారు. చర్చ అనంతరం అన్ని పార్టీలను ఒకే వేధికపైకి తీసుకువచ్చి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టేందుకు కీలకపాత్ర పోషించానని ఆయన చెప్పారు. బాబ్లీ పోరాటంలో పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నది కూడా తెలంగాణ ప్రజల కోసమేనని ఆయన స్పష్టం చేశారు. బయ్యారం గనుల విషయంలో 1.50 లక్షల ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయటానికి సిద్ధపడితే రాష్ట్రానికి, జిల్లాకు అన్యాయం జరగవద్దని పార్లమెంట్ సభ్యునిగా అ అదేశాలను రద్దు చేయించడంలో కీలక పాత్ర పోషించానన్నారు. తెలంగాణ వస్తే విద్యుత్ ఉండదని అన్న వారి మాటలను తలకిందులుగా చేసి ఈ రోజు 24 గంటల విద్యుత్ సరఫరాకు కెసిఆర్ చేసిన కృషిని రాష్ట్ర ప్రజలు ఎన్నటికి మరువరన్నారు. అనాడు విద్యుత్ కోసం ధర్నా చేసిన వ్యక్తుల్లో తాను ప్రథమ స్థానంలో ఉన్నానన్నారు. గడిచిన ఐదెండ్ల పాలన చూసి టిఆర్‌ఎస్‌లో చేరానని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కెసిఆర్ పాలన సాగుతుందని, దేశంలో ఆదర్శవంతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అర్హులైన పేదలకు అందిస్తూ ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న పెద్ద కోడుకు కెసిఆర్ అని అన్నారు. ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో తాను మాట్లాడానని, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కలిసి ప్రచారం చేస్తామన్నారు. 2009లో తనను గెలిపించి పార్లమెంట్‌కు పంపించారని, మరోమారు కూడా అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ఏప్రిల్ 9 వరకు ఖమ్మం పార్లమెంటరీ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేస్తానన్నారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజల అభిష్టం మేరకు టిఆర్‌ఎస్‌లో చేరానన్నారు. రాజకీయాల్లోకి రాక ముందే నామా ముత్తయ్య ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు చేరువయ్యానన్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు మొట్టమొదటిసారి సంతకం చేసింది తనేనని గుర్తు చేశారు. తెలంగాణ రావాలని, అభివృద్ధి జరగాలని కోరుకున్న ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ వచ్చిందన్నారు. గత ఐదేళ్ల కాలంలో సాగు, తాగునీరు అందించటంలో రాష్ట్రం ముందుందన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలు రైతన్నలకు భరోసా కల్పిస్తున్నాయన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని సాధిస్తామన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కొవ్వూరు రైల్వే లైన్‌ను పూర్తి చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. సూర్యాపేట నుంచి రాజమండ్రి పోర్‌వే లైన్ నిర్మాణ పనులు త్వరితగతిన చేపడతానని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్ర పాలన ఎంతో బాగుందన్నారు. టిడిపి క్యాడర్ తనవైపే ఉన్నారని చెప్పారు. తన నిర్ణయాన్ని మెజార్టీ కార్యకర్తలు అర్ధం చేసుకున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి వేరని, ఇప్పటి ఎన్నికల పరిస్థితి వేరన్నారు. ఈ ఎన్నికల్లో టిడిపి పోటీలో లేదన్నారు. 2014లో ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్‌కు ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారని, అయినప్పటికీ ఖమ్మం జిల్లా అభివృద్ధిలో ముందుందన్నారు. పార్టీలకు అతీతంగా తనను ఆదరిస్తారన్నారు. పార్టీల కంటే కూడా వ్యక్తిగతంగా తనను ఆదరించేవారు ఎక్కువగా ఉన్నారన్నారు. టిఆర్‌ఎస్ క్యాడర్ అంతా తకు పూర్తి మద్ధతు పలుకుతుందన్నారు. పార్టీ విధానాల మేరకు నిర్ణయాలు ఉంటాయని, బిజెపి, కాంగ్రెస్‌ను ఓడించటమే టిఆర్‌ఎస్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ముస్లీం, మైనార్టీలకు చెందిన మెజార్టీ ప్రజలు టిఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని ఆయన చెప్పారు.

Nama Nageswara Rao Comments on Lok Sabha Elections

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: