పాలమూరులో కాంగ్రెస్ ఫినిష్!

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో : ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ కకావికలం అవుతోంది. కాంగ్రెస్ సీసియర్ నేతలు ఒకొక్కరు ఆ పార్టీకి దూరం అవుతున్నారు. గత రెండు రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. మాజీ మంత్రి, సీనియర్ నేత డికె అరుణ బిజెపిలో చేరగా, తాజా గా ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ […]

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో : ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ కకావికలం అవుతోంది. కాంగ్రెస్ సీసియర్ నేతలు ఒకొక్కరు ఆ పార్టీకి దూరం అవుతున్నారు. గత రెండు రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. మాజీ మంత్రి, సీనియర్ నేత డికె అరుణ బిజెపిలో చేరగా, తాజా గా ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టిఆర్‌ఎస్ గూటికి చేరారు. బుధవారం హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను కలిశారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు మరి కొద్ది రోజులు ఉండగానే కాంగ్రె స్ నాయకులు పార్టీ వీడుతుండడంతో ఆ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఉన్న నేతలు ఒక్కొక్కరు చేజారి పొతుండడంతో కాంగ్రెస్ ఇక ఖతమైనట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉన్న నేతల్లో కొందరు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల దేవరకద్ర నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన డోకూర్ పవన్ కుమార్ రెడ్డి డికె అరుణతో పాటు బిజెపిలో చేరారు.

ఇక నారాయణపేట నుంచి డికె అరుణ అనుచరుడు శివకుమార్‌రెడ్డి, షాద్‌నగర్‌మ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డితో పాటు మహబూబ్‌నగర్ నుంచి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన టిడిపి అభ్యర్థి ఎర్రశేఖర్ కూడా డికె అరుణ అధ్వర్యం లో బిజెపిలోకి చేరుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. డికె అరుణకు ఉమ్మడి జిల్లాలో గద్వాల, అలంపూర్, కొల్లాపూర్, మహబూబ్‌నగర్, దేవరకద్ర, నారాయణపేట, మఖ్తల్ నియోజకవర్గాలలో అమె వర్గీయులు ఉన్నారు. వారంత కూడా డికె అరుణ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మిగిలిన సీనియర్ నేతలైన మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, మల్లురవిలకు వయస్సు మీద పడుతుండడంతో పార్టీ కోసం చురుగ్గా పని చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇక ఉన్న రేవంత్‌రెడ్డి కూడా ఇటీవల జరగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన జిల్లా నుంచి దూరమై మల్కాజిగిరి ఎంపిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండంతో జిల్లాకు దూరమైనట్లేనని ఇక కాంగ్రెస్‌లో వద్ద నేతలు మినగా యువ నేతలు లేని పరిస్థితి ఏర్పడింది.
ఎంపి అభ్యర్థుల్లో కలకలం..
మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్‌కు కాంగ్రెస్ నుంచి పోటీ చేయనున్న మల్లురవి, వంశీచందర్ రెడ్డిల్లో కలకలం మొదలైంది. ఇటు డికె అరుణ, మరో వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్సవర్దన్ రెడ్డి పార్టీలు మారడంతో రెండు పార్లమెంట్‌లోని కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇప్పటికే ఊపు మీదున్న టిఆర్‌ఎస్‌ను ఢీ కొట్టే సాహసం చేయలేకపోతున్నారు. దీంతో రాజకీయంగా టిఆర్‌ఎస్‌కు పెద్ద లాభంగా మారిందని చెబుతున్నారు. మరో వైపు కాంగ్రెస్‌లోనే టికెట్‌పై ఆశించి భంగపడ్డ నేతలు కూడా కాంగ్రెస్ ప్రచారానికి దూరం అయ్యే పరిస్ధితులు నెలకొన్నాయి. మొత్తానికి మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఖతమైనట్లేనని భావిస్తున్నారు.

Nallur urnool Lok Sabha Congress candidate Mallu Ravi

Related Stories: