హాజీపూర్ సైకోని దోషిగా తేల్చిన పోక్సో కోర్టు

  నల్గొండ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని పోక్సో కోర్టు దోషిగా తేల్చింది. గురువారం జిల్లాలోని పోక్సో కోర్టు ఈ కేసులో తుది తీర్పు వెల్లడించింది. మూడు కేసుల్లోనూ శ్రీనివాస్ రెడ్డిని దోషిగా ప్రకటంచింది. హత్యాచారం, హత్య కేసులో నేరం నిరూపితమైందని, ఏమైనా చెప్పుకునేది ఉందా? అని అతడిని న్యాయమూర్తి ప్రశ్నించిగా.. తాను ఏ తప్పు చేయలేదని, తనను కావాలనే ఇరికించారని… తనకు తల్లిదండ్రులు ఉన్నారని, […] The post హాజీపూర్ సైకోని దోషిగా తేల్చిన పోక్సో కోర్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నల్గొండ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని పోక్సో కోర్టు దోషిగా తేల్చింది. గురువారం జిల్లాలోని పోక్సో కోర్టు ఈ కేసులో తుది తీర్పు వెల్లడించింది. మూడు కేసుల్లోనూ శ్రీనివాస్ రెడ్డిని దోషిగా ప్రకటంచింది. హత్యాచారం, హత్య కేసులో నేరం నిరూపితమైందని, ఏమైనా చెప్పుకునేది ఉందా? అని అతడిని న్యాయమూర్తి ప్రశ్నించిగా.. తాను ఏ తప్పు చేయలేదని, తనను కావాలనే ఇరికించారని… తనకు తల్లిదండ్రులు ఉన్నారని, వారిని చూసుకోవాల్సిన బాధ్యత తనమీదే ఉందని రోధిస్తూ చెప్పాడు. దీంతో జడ్జి జోక్యం చేసుకుని మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటున్నారో తెలుసా అని ప్రశ్నించారు. తన తల్లిదండ్రులు ఎక్కడున్నో తెలియదని, కోపంతో తన ఇల్లు కూడా తగలబెట్టారని, తన అన్న వదినను కూడా గ్రామం నుంచి వెళ్లగొట్టారని చెప్పాడు. కాగా, మరికొద్ది నిమిషాల్లో నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో ముగ్గురు మైనర్ బాలికల హత్యలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. 2019 ఆగస్టులో జరిగిన బాలిక హత్యాచారం కేసును చేధించే క్రమంలో దోషి శ్రీనివాస్ రెడ్డి నేర చరిత్ర బయటపడింది.

Nalgonda POCSO Court Tells Srinivas Reddy as Convict

The post హాజీపూర్ సైకోని దోషిగా తేల్చిన పోక్సో కోర్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: