అభివృద్దిని చూసే పార్టీలో చేరికలు: నోముల

హాలియా: సిఎం కెసిఆర్ చేపడుతున్న అభివృద్ది సంక్షేమపథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. హాలియాలోని తన నివాసంలో ఆదివారం పెద్దవూర మండలం శిర్సనగండ్ల గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఆయన సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రవేశపెడుతున్న పలు పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. పార్టీలో చేరిన వారిలో పుట్ట గోవిందారెడ్డి, కనుమంతరెడ్డి అరుణ, అద్దంకి […]

హాలియా: సిఎం కెసిఆర్ చేపడుతున్న అభివృద్ది సంక్షేమపథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. హాలియాలోని తన నివాసంలో ఆదివారం పెద్దవూర మండలం శిర్సనగండ్ల గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఆయన సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రవేశపెడుతున్న పలు పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. పార్టీలో చేరిన వారిలో పుట్ట గోవిందారెడ్డి, కనుమంతరెడ్డి అరుణ, అద్దంకి గోవర్ధన్, కంభంపాటి శ్రీను, కంభంపాటి హరీష్, మునగాల ప్రభాకర్, కంభంపాటి సైదులు, కందుల కోటయ్య, కంభంపాటి కర్ణకల్ తదితరులున్నారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు యడవల్లి విజయేందర్‌రెడ్డి, కురాకుల వెంకటేశ్వర్లు, కర్ణా బ్రహ్మనందరెడ్డి, కురాకుల రవికుమార్, రాజేష్‌నాయక్ తదితరులున్నారు.

Nagarjuna Sagar TRS MLA Nomula Narsimhaiah Speech

Related Stories: