సాగరమై రూపు సవరించుకోగా…

మన తెలంగాణ/హైదరాబాద్ / నాగార్జునసాగర్ : దాదాపుగా పదేళ్ల తర్వాత నాగార్జునసాగర్‌లో 24 గేట్లు ఎత్తారు. ఎగువ నుంచి ఉధృతంగా వస్తున్న ప్రవాహాలతో సాగర్ నుంచి కాస్త ముందుగానే నీటిని గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌కు 766080 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, దిగువకు 367580 క్యూసెక్కులు వదులుతున్నారు. జూరాలకు 834000 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీటికి తుంగభద్ర నుంచి వస్తున్న నీరు తోడవడంతో శ్రీశైలానికి […] The post సాగరమై రూపు సవరించుకోగా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్ / నాగార్జునసాగర్ : దాదాపుగా పదేళ్ల తర్వాత నాగార్జునసాగర్‌లో 24 గేట్లు ఎత్తారు. ఎగువ నుంచి ఉధృతంగా వస్తున్న ప్రవాహాలతో సాగర్ నుంచి కాస్త ముందుగానే నీటిని గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌కు 766080 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, దిగువకు 367580 క్యూసెక్కులు వదులుతున్నారు. జూరాలకు 834000 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీటికి తుంగభద్ర నుంచి వస్తున్న నీరు తోడవడంతో శ్రీశైలానికి వచ్చే ప్రవాహం ఘననీయంగా పెరుగనుంది. శ్రీశైలంకు ప్రస్తుతం 820000 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా, 850000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర రిజర్వాయర్‌కు 244000 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుంటే, 213000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. సుంకేషుల బ్యారేజి నుంచి సాయంత్రం 6 గంటల సమయంలో 210000 క్యూసెక్కులు గేట్లు తెరిచి శ్రీశైలానికి వదిలారు. నాగార్జునసాగర్‌లో 312 టిఎంసిలకు గాను 250 టిఎంసిల నీరు నిల్వ ఉంది.

అయితే ఎగువ నుంచి భారీ స్థాయిలో వస్తున్న నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా దిగువకు నీటిని గేట్లు ఎత్తి వదులుతున్నారు. ఇదిలా ఉండగా ఆల్మట్టికి 570000 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా, దిగువకు 540000 క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణపూర్‌కు 590000 క్యూసెక్కులు వస్తుంటే, 600000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. భీమా నదిపై ఉజ్జయిని డ్యాంకు సైతం 68000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో స్థిరంగా వస్తుంటే, దిగువకు 110000 క్యూసెక్కులు వదులుతున్నారు. జూరాలకు 834000 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుంటే, దిగువకు 827000 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇదేవిధంగా దిగువ గోదావరి బేసిన్‌లో నీటి ప్రవాహం భారీగా వస్తుంది. ఎగువ గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులు మాత్రం నీటి కోసం ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్నాయి.

జైక్వాడ్ డ్యాంకు 34000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంటే, కెనాళ్లకు 3000 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇక్కడ 102 టిఎంసిలకు గాను 94 టిఎంసిల మేర నీరు నిల్వ అయింది. దీంతో మరో వర్షం పడితే నీటిని గేట్లు ఎత్తి దిగువకు వదలక తప్పని పరిస్థితి ఉంటుంది. శ్రీరాంసాగర్‌కు 2960 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంటే, 389 క్యూసెక్కులు అవుట్‌ఫ్లోగా ఉంది. ఇక్కడ 90 టిఎంసిలకు గాను 16.5 టిఎంసిల నీరు నిల్వ ఉంది. కడెం రిజర్వాయర్‌కు 4054 క్యూసెక్కులు వస్తుంటే, 389 క్యూసెక్కులు కెనాళ్లకు వదిలారు. ఎల్లంపల్లికి 5570 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుంటే, అంతే స్థాయిలో నీటిని దిగువకు వదిలారు. ఈ నీటికితోడు వర్షపు నీరు, ప్రాణహి త నుంచి కలిసిన జలాలతో కలిపి లక్షలాది క్యూసెక్కుల నీరు లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజి మీదుగా దిగువకు వెళుతుంది. తుపాకులగూడెం వద్ద ఇంద్రావతి నీరు కలిసి భద్రాచలం వద్ద ఉదృతంగా ప్రవహిస్తూ పోలవరం మీదుగా బంగాళాఖాతాన్ని వెతుక్కుంటూ నీరు వెళుతోంది.
పర్యాటకుల సందడి
వరద కృష్ణమ్మ అందాలను వీక్షించడానికి పర్యాటకులు ఉదయం నుండే పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఇక్కడి రోడ్లన్నీ రద్దీగా మారాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా పోలీస్‌లు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నాగార్జునసాగర్‌కు పర్యాటకుల రద్దీ పెరడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మిర్యాలగూడ డిఎస్‌పి శ్రీనివాస్ పరిశీలించారు. ఉదయం 7.30గం.కు అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ లాంచీలను నిలిపివేసింది. లాంచీ ప్రయణంకోసం పర్యాటకులు విజయపురిసౌత్‌లోని లాంచీస్టేషన్‌కు వెళుతున్నారు.

సాగర్ అందాలను వీక్షించడానికి వచ్చిన ఓ వ్యక్తి గల్లంతైన సంఘటన సోమవారం నాగార్జునసాగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులువివరాల ప్రకారం.. సోమవారం సాగర్ డ్యాం క్రస్టుగేట్లు తెరుస్తారన్న విషయం తెలుసుకొని జహీరాబాద్ నుండి మర్క నర్సింహులు(45) తన స్నేహితులతో కలిసి సాగర్ చూడటానికి వచ్చారు. సాగర్ డ్యాం గేట్లను చూస్తూ పైలాన్ శివాలయం వద్దకు చేరుకొన్నారు. అక్కడే ఉన్న పుష్కరఘాట్‌లో ఉన్న నీళ్ళను చూసి స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్ళగా ఘాటులోకి నీటి ప్రవాహం పెరగడంతో ఒడ్డునే ఉన్న స్నేహితులు నర్సింహులును ఒడ్డుకు రమ్మని కేకలు వేస్తున్న అప్పటికే నీటి ప్రవాహంతో కొట్టుకుపోయాడు. ఈ సంఘటనకు సంబంధించి స్నేహితులు పోలీసులకు ఫిర్యా దు చేసి కుటుంVwకులకు సమాచారం అందించారు. అదేవిధంగా, విజయపురిసౌత్‌లో కూలిపోయిన వంతె న వద్ద మరో వ్యక్తి సాగర్ డ్యాంను చూస్తూ ప్రమాదవశాత్తు కాలు జానరి వంతెనపై నుండి కిందపడగా, పర్యాటకులు రక్షించి ఆసుపత్రికి తరలించారు.

 Nagarjuna Sagar 24 Gates Lifted

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సాగరమై రూపు సవరించుకోగా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: