మ్యూజికల్ లవ్ స్టొరీ

  ‘ఫిదా’ సంచలన విజయం తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో -నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా కొత్త సినిమా షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఆన్‌లొకేషన్‌లో జరిగిన పూజా కార్యక్రమంలో శేఖర్ కమ్ముల, నాగ చైతన్య, సాయి పల్లవి, నిర్మాతలు సునీల్ దాస్ కె. నారంగ్, ఎఫ్‌డిసి చైర్మన్ పి రామ్మోహన్ రావు, భరత్ నారంగ్, కో ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్, డిస్ట్రిబ్యూటర్లు సదానంద్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏషియన్ గ్రూప్స్ అధినేత సునీల్ […] The post మ్యూజికల్ లవ్ స్టొరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘ఫిదా’ సంచలన విజయం తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో -నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా కొత్త సినిమా షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఆన్‌లొకేషన్‌లో జరిగిన పూజా కార్యక్రమంలో శేఖర్ కమ్ముల, నాగ చైతన్య, సాయి పల్లవి, నిర్మాతలు సునీల్ దాస్ కె. నారంగ్, ఎఫ్‌డిసి చైర్మన్ పి రామ్మోహన్ రావు, భరత్ నారంగ్, కో ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్, డిస్ట్రిబ్యూటర్లు సదానంద్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏషియన్ గ్రూప్స్ అధినేత సునీల్ నారంగ్… శేఖర్ కమ్ములకి స్క్రిప్ట్ అందించారు. శేఖర్ కమ్ముల తండ్రి శేషయ్య క్లాప్ ఇవ్వగా డిస్ట్రిబ్యూటర్ సదానంద కెమెరా స్విచ్చాన్ చేశారు.

ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె.నారంగ్, పి. రామ్మోహన్ రావు ఈ మ్యూజికల్ లవ్ స్టొరీ మూవీని నిర్మిస్తున్నారు. హీరోహీరోయిన్లు నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ సీన్‌తో సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా నిర్మాత పి.రామ్మోహన్ రావు మాట్లాడుతూ “మూడు షెడ్యూళ్లలో ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం మొదలైన షెడ్యూల్ పది రోజుల పాటు కొనసాగుతుంది. శేఖర్ కమ్ముల ఒక మంచి మ్యూజికల్ లవ్ స్టొరీని తెర మీద ఆవిష్కరించబోతున్నారు”అని అన్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ “గ్రామం నుండి వచ్చి జీవితంలో ఏదో సాధించాలని అనుకునే యువతీయువకుల మధ్య ప్రేమ కథే ఈ చిత్రం.

తొలిసారి ఒక మ్యూజికల్ లవ్ స్టొరీలో నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్నారు. తెలంగాణ యాసని నాగచైతన్య బాగా ఇష్టపడి నేర్చుకున్నారు. అతని పాత్ర ఈ సినిమాకు హైలెట్ అవుతుంది. సాయిపల్లవి ఈ కథకు పర్‌ఫెక్ట్‌గా సరిపోతుంది. నా సినిమాలలో మ్యూజిక్ బలంగా ఉంటుంది. ఇందులో ఆ బలం మరింత గా కనిపిస్తుంది. రెహ్మాన్ స్కూల్ నుండి వచ్చిన పవన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు”అని చెప్పారు. ఈ చిత్రానికి ఆర్ట్: రాజీవ్ నాయర్, కెమెరా: విజయ్ సి కుమార్, మ్యూజిక్: పవన్, సహ నిర్మాత: విజయ్ భాస్కర్.

Naga Chaitanya and Sai Pallavi Movie shooting started

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మ్యూజికల్ లవ్ స్టొరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: