కొండ చరియ విరిగిపడి 34 మంది మృతి

మలమైన్(మయన్మార్): తూర్పు మయన్మార్‌లో భారీ వర్షాలకు శనివారం కొండచరియ విరిగి పడి 34 మంది మృతి చెందారు. దట్టంగా పేరుకు పోయిన మట్టికింద కూరుకుపోయిన వారి కోసం అత్యవసర కార్మికులు మట్టి పెళ్లలను తొలగిస్తున్నారు. మయన్మార్‌లో రుతుపవనాల వర్షాలు ఉపద్రవంగా ముంచుకు వచ్చాయి. ఏటా ఇలాంటి వైపరీత్యం సంభించడం ఇక్కడ పరిపాటిగా సాగుతోంది. కొండ ప్రాంతాల్లో ఉండే వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మాన్ రాష్ట్రం లోని యే ప్యార్ కొనె గ్రామంలో శుక్రవారం 16 ఇళ్లు తుడిచిపెట్టుకు […] The post కొండ చరియ విరిగిపడి 34 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


మలమైన్(మయన్మార్): తూర్పు మయన్మార్‌లో భారీ వర్షాలకు శనివారం కొండచరియ విరిగి పడి 34 మంది మృతి చెందారు. దట్టంగా పేరుకు పోయిన మట్టికింద కూరుకుపోయిన వారి కోసం అత్యవసర కార్మికులు మట్టి పెళ్లలను తొలగిస్తున్నారు. మయన్మార్‌లో రుతుపవనాల వర్షాలు ఉపద్రవంగా ముంచుకు వచ్చాయి. ఏటా ఇలాంటి వైపరీత్యం సంభించడం ఇక్కడ పరిపాటిగా సాగుతోంది. కొండ ప్రాంతాల్లో ఉండే వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మాన్ రాష్ట్రం లోని యే ప్యార్ కొనె గ్రామంలో శుక్రవారం 16 ఇళ్లు తుడిచిపెట్టుకు పోయాయి. సహాయ బృందాలు రాత్రీ పగలనక మట్టి తవ్వుతూ బురద పెళ్లలను తొలగిస్తున్నారు. పెళ్లల అడుగున ఇంకా ఎవరైనా సజీవంగా ఉన్నారేమోనని గాలిస్తున్నారు. ఇంతవరకు 47 మంది గాయపడ్డారని, 80 మంది గల్లంతయ్యారని స్థానిక అడ్మినిస్ట్రేటర్ మ్యో మిన్ తున్ చెప్పారు. గ్రామం కొండపక్కన ఆలయం వరదలకు మునిగిపోయింది. బంగారు గోపురం మీదకు కనిపిస్తుంది. వరదల కారణంగా ఇటీవల 89,000 మంది నిర్వాసితులయ్యారు. వీరిలో కొందరే తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారు.

Myanmar Landslide Kills 34

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కొండ చరియ విరిగిపడి 34 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: