తేజతో చేస్తున్న నాలుగవ చిత్రం ‘సీత’

  బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘సీత’. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ “లవ్, కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సీత’. కొత్తదనంతో కూడిన ఈ చిత్రంలో హీరోహీరోయిన్లు బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్‌తో పాటు ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. అయితే హీరోయిన్ […] The post తేజతో చేస్తున్న నాలుగవ చిత్రం ‘సీత’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘సీత’. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ “లవ్, కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సీత’. కొత్తదనంతో కూడిన ఈ చిత్రంలో హీరోహీరోయిన్లు బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్‌తో పాటు ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. అయితే హీరోయిన్ కాజల్ చుట్టూ కథ తిరుగుతుంది. సినిమాలో సందర్భానుసారంగా పాటలుంటాయి. ఇక పాయల్ రాజ్‌పుత్ స్టెప్పులు వేసిన ‘బుల్ రెడ్డి…’ స్పెషల్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. మిగతా ఐదు పాటలు కథకు అనుగుణంగా ఉంటాయి. పాటలతో పాటు ఆర్‌ఆర్ కూడా అద్భుతంగా కుదిరింది. దర్శకుడు తేజతో కలిసి పనిచేయడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. ‘నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత ఆయనతో చేస్తున్న చిత్రమిది. తేజతో చేస్తున్న నాలుగవ సినిమా ‘సీత’. సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అద్భుతంగా నటించారు. ‘సీత’ మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకముంది”అని తెలిపారు.

Music Director Anup Rubens given music to Sita Movie

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తేజతో చేస్తున్న నాలుగవ చిత్రం ‘సీత’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: