మరో మానవ మృగం.. ఏడుగురు మహిళల్ని..

  మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ లో ఈ నెల 17వ తేదీ మంగళవారం డోకూర్‌ గ్రామ శివారులోని పంట పొలాల్లో ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. అత్యాచారం చేసి హతమార్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అంతేకాదు, గతంలో జరిగిన ఏడు హత్యలతో అతనికి సంబంధం ఉన్నట్టు గుర్తించారు. డోకూర్‌లోని కల్లు కాంపౌండ్‌లో నిత్యం మద్యం సేవించే నిందితుడు.. అక్కడ కల్లు తాగేందుకు వచ్చే మహిళలతో మాట […] The post మరో మానవ మృగం.. ఏడుగురు మహిళల్ని.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ లో ఈ నెల 17వ తేదీ మంగళవారం డోకూర్‌ గ్రామ శివారులోని పంట పొలాల్లో ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. అత్యాచారం చేసి హతమార్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అంతేకాదు, గతంలో జరిగిన ఏడు హత్యలతో అతనికి సంబంధం ఉన్నట్టు గుర్తించారు. డోకూర్‌లోని కల్లు కాంపౌండ్‌లో నిత్యం మద్యం సేవించే నిందితుడు.. అక్కడ కల్లు తాగేందుకు వచ్చే మహిళలతో మాట కలిపేవాడు. ఆపై వారిని తనతో తీసుకెళ్లి, నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారం చేసి హత్య చేసేవాడు.అలా అతని చేతిలో ఇప్పటివరకు ఏడుగురు మహిళలు బలయ్యారు. దీనిపై దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు, ఈ నేరాలన్నీ ఒక్కడే చేశాడా..? లేక అతనితో పాటు మరెవరైనా ఉన్నారా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

Murder seven women at Mahabubnagar

The post మరో మానవ మృగం.. ఏడుగురు మహిళల్ని.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.