పసిగుడ్డుపై పశువాంఛ…

  తొమ్మిది మాసాల పాపపై హత్యాచారం తల్లి ఒడి నుంచి అపహరించి అత్యాచారం చేసి హతమార్చిన మాటలకందని అమానుషం దిగ్భ్రాంతితో చలించిపోయిన జనం, నిరసనలతో అట్టుడికిన వరంగల్ వరంగల్ : అభం శుభం తెలియని పసి పాపను కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ దుర్మార్గుడు చిదిమేశాడు. సంవత్సరం కూడా నిండని చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మానవత్వానికి తీరని మచ్చగా మిగిలింది. తొమ్మిది నెలల పసికందును తల్లి ఒడి నుండి అపహరించి అత్యాచారం చేసి […] The post పసిగుడ్డుపై పశువాంఛ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తొమ్మిది మాసాల పాపపై హత్యాచారం

తల్లి ఒడి నుంచి అపహరించి అత్యాచారం చేసి హతమార్చిన మాటలకందని అమానుషం

దిగ్భ్రాంతితో చలించిపోయిన జనం, నిరసనలతో అట్టుడికిన వరంగల్

వరంగల్ : అభం శుభం తెలియని పసి పాపను కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ దుర్మార్గుడు చిదిమేశాడు. సంవత్సరం కూడా నిండని చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మానవత్వానికి తీరని మచ్చగా మిగిలింది. తొమ్మిది నెలల పసికందును తల్లి ఒడి నుండి అపహరించి అత్యాచారం చేసి హత్య చేసిన ఉన్మాది అనంతరం పసికందు మృతదేహాన్ని భుజాన వేసుకొని వెళుతండగా కాలనీ ప్రజలు పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలోని కుమార్‌పల్లిలో జరిగింది. స్థానికుల కథనం ప్ర కారం సంఘటన వివరాలిలా ఉన్నాయి.

వరంగల్ పసిగుడ్డుపై అర్బన్ జిల్లా కేంద్రంలోని హన్మకొండ టైలర్‌స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న జక్కోజి జగన్, రచన దంపతుల కుమార్తె తొమ్మిదినెలల పసికందు శ్రీహిత ఈ అఘాయిత్యానికి బలైంది. జగన్ అక్కబావలు చుట్టపు చూపుగా మంగళవారం రాత్రి ఇంటికి వచ్చారు. మంగళవారం రాత్రి 11.30గంటల వరకు కుటుంబ సభ్యులంతా కలిసి మాట్లాడుకొని ఇంటిపైన నిద్ర పోయారు. తొమ్మిది నెలల పసికందు శ్రీహిత తల్లి ఒడిలో పడుకొని ఉండగా కొలెపాక ప్రవీణ్ దొంగతనాల కోసం అదేవీధిలో మంగళవారం అర్ధరాత్రి తిరుగుతున్నాడు. జగన్ ఇంటిపైన నిద్రిస్తున్న శ్రీహిత తల్లి రచన, తండ్రి జగన్‌తో కుటుంబసభ్యులంతా నిద్రపోయారు.

అదే సమయంలో ఇంటిపైకి వచ్చిన ప్రవీణ్ అక్కడున్న సెల్‌ఫోన్లను దొంగిలించి తల్లిఒడిలో నిద్రపోతున్న శ్రీహితను అపహరించుకొని వెళ్లాడు. అదే కాలనీలో పక్కనున్న ఖాళీస్థలంలో పసికందుపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అప్పటికే శ్రీహిత మరణించింది. ఎవరూ చూడలేదనుకున్న ప్రవీణ్ పసికందు మృతదేహాన్ని మూటకట్టుకొని భుజంపై వేసుకొని వెళ్తున్నాడు. అప్పటికే శ్రీహిత తల్లికి మెళకువ వచ్చి చూసే సరికి పాప కనిపించకపోవడంతో పక్కనున్న తమ్ముడు జగన్ కుటుంబ సభ్యులందరినీ లేపి పాప కోసం వెతకడం మొదలు పెట్టారు. పక్క ఇంటి డాబాపై నిద్రిస్తున్న యువకుల వద్ద ఉన్న సెల్‌ఫోన్లు కూడా కనిపించలేదు. దొంగలే ఈ పనిచేశారని టైలర్‌స్ట్రీట్ కాలనీ ప్రజలంతా మూకుమ్మడిగా పాప కోసం వెతకడం మొదలుపెట్టారు.

పాప మృతదేహాన్ని మూటగట్టి భుజాన వేసుకొని వెళ్తున్న ప్రవీణ్ వారి కంట కనపడడంతో పాప అతడు మూటను కిందపడేసి పరుగెత్తడం మొదలుపెట్టాడు. యువకులు వెంటపడి పట్టుకున్నారు. పాపకు తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే హన్మకొండలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. అప్పటికే పాపపై అఘాయిత్యానికి పాల్పడిన ఉన్మాది ప్రవీణ్‌ను పట్టుకొని కాలనీ ప్రజలు 100కు డయల్ చేశారు. తక్షణమే వచ్చిన పోలీసులకు ఉన్మాదిని అప్పగించారు. జరిగిన సంఘటనపై పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని బుధవారం ఉదయం ఇంటి వద్ద విచారణను ప్రారంభించారు.

ఉన్మాదిని ఉరితీయాలని వెల్లువెత్తిన నిరసనలు: తొమ్మిది నెలల పసికందుపై ఉన్మాది కొలెపాక ప్రవీణ్ చేసిన అఘాయిత్యంపై సభ్య సమాజం ఉలిక్కిపడింది. ఉన్మాదిని వెంటనే ఉరితీయాలని, లేదా ఎన్‌కౌంటర్ చేయాలని మహిళా సంఘాలు, సామాజిక వేత్తలు, ప్రజాసంఘాలు భారీ ఎత్తున నిరసనకు దిగాయి. బుధవారం ఉదయం జరిగిన సంఘటనపై హన్మకొండ సిఐ సంపత్‌రావు ఆధ్వర్యంలో విచారణకు వెళ్లగా అక్కడి నుండే మహిళలు ఆందోళన చేశారు. ఈ ఘటన సమాచారం తెలవడంతో త్రినగరాలు కాజీపేట, హన్మకొండ, వరంగల్ నగరాలు ప్రజాసంఘాల ఆందోళనలతో అట్టుడికాయి.

హన్మకొండ చౌరస్తా, వరంగల్ ఎంజిఎం ప్రాంతాల్లో చిన్నారిని చిదిమి వేసిన సంఘటనపై ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. పోలీసులు నిరసనలను అదుపులోకి తీసుకురావడానికి భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. దీనిపై వరంగల్ సిపి డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ రంగంలోకి దిగి ఉన్మాదిని కఠినంగా శిక్షించేలా చేస్తామన్నారు. నిందితుడు కొలెపాక ప్రవీణ్ శాయంపేట మండలం, వసంతపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. హన్మకొండలో ఒక హోటల్‌లో పనిచేస్తూ రాత్రిపూట ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడేవారని సిపి పేర్కొన్నారు. అదే పరంపరలో ప్రవీన్ చిన్నారిని అపహరించి ఈ అఘాయిత్యానికి పాల్పడడం దారుణమని అతనిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

Murder over nine months of Child

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పసిగుడ్డుపై పశువాంఛ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: