దొంగగా భావించి …

Murderనిజామాబాద్: ధర్మారం గ్రామంలో దొంగగా భావించి ప్రజలు ఓ వ్యక్తిని చితకబాదారు. తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అర్సంపల్లికి చెందిన గంగాధర్ ఆలయాల్లో చోరీ చేస్తున్నట్టు ధర్మారం ప్రజలు అనుమానించి చితకబాదారు. దీంతో గంగాధర్ తీవ్రంగా గాయపడ్డాడు. గంగాధర్ మేస్త్రీ పని చేస్తుంటాడని సమాచారం.  గంగాధర్ మృతితో అర్సంపల్లిలో విషాదం నెలకొంది. పోస్టుమార్టం కోసం గంగాధర్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Murder of a man who is considered a thief

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దొంగగా భావించి … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.