బీహార్‌లో దారుణం…

పాట్నా: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను దారుణంగా హత్య చేసిన ఘటన బీహార్‌లోని కిద్వాయ్‌పురిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. నితిన్‌ సరాఫ్‌ పాట్నాలో పేరొందిన వ్యాపారి. ఆయనకు చాలా బట్టల షాపులు కూడా ఉన్నాయి. ఈయనకు భార్య ఆక్లా సరాఫ్‌, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, నిన్న రాత్రి నితిన్‌, ఆక్లాతో పాటు వారి కుమార్తెను దుండగులు హత్య చేశారు. నితిన్‌ కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు. కుటుంబ […] The post బీహార్‌లో దారుణం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పాట్నా: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను దారుణంగా హత్య చేసిన ఘటన బీహార్‌లోని కిద్వాయ్‌పురిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. నితిన్‌ సరాఫ్‌ పాట్నాలో పేరొందిన వ్యాపారి. ఆయనకు చాలా బట్టల షాపులు కూడా ఉన్నాయి. ఈయనకు భార్య ఆక్లా సరాఫ్‌, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, నిన్న రాత్రి నితిన్‌, ఆక్లాతో పాటు వారి కుమార్తెను దుండగులు హత్య చేశారు. నితిన్‌ కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. భూ వివాదాలే వీరి హత్యలకు కారణమని పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Murder Husband Wife Children At Bihar Patna Kidwaipuri

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బీహార్‌లో దారుణం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: