ఒంటరి మహిళపై హత్యాయత్నం

  ఖమ్మం: జిల్లాలోని దుండగులు ఒంటరి మహిళను కరెంట్ షాక్ పెట్టి హతమాత్చేందు ప్రయత్నం చేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నేలకొండపల్లి మండలం సుర్ధపల్లిలో ఒంటరి మహిళను చంపేందుకు గుర్తు తెలియని దుండగులు అర్థరాత్రి అందరు నిద్రించిన తరువాత తన ఇంటి చుట్టూ ఇనుప తీగలను చుట్టి విద్యుత్ సరఫరా చేశారు. మహిళకు ఉదయం కరెంట్ షాక్ తగిలి కింద పడిపోవడంతో అది గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమితం దవాఖానాకు తరలించారు.  […]

 

ఖమ్మం: జిల్లాలోని దుండగులు ఒంటరి మహిళను కరెంట్ షాక్ పెట్టి హతమాత్చేందు ప్రయత్నం చేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నేలకొండపల్లి మండలం సుర్ధపల్లిలో ఒంటరి మహిళను చంపేందుకు గుర్తు తెలియని దుండగులు అర్థరాత్రి అందరు నిద్రించిన తరువాత తన ఇంటి చుట్టూ ఇనుప తీగలను చుట్టి విద్యుత్ సరఫరా చేశారు. మహిళకు ఉదయం కరెంట్ షాక్ తగిలి కింద పడిపోవడంతో అది గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమితం దవాఖానాకు తరలించారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలియజేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

Murder attempt on Single woman in Khammam

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: