వచ్చే నెలలోనే మున్సిపల్ ఎన్నికలు

-సిఎం ప్రకటనతో వేడెక్కుతున్న రాజకీయం – ఎంఎల్ఎల చుట్టూ ఔత్సాహికుల ప్రదక్షిణలు ఆదిలాబాద్ ప్రతినిధి : మున్సిపాలిటీ పాలకవర్గ పదవీ కాలం వచ్చే నెలలో ముగుస్తుండడంతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వచ్చే నెల 3వ తేదీతో ప్రస్తుత పాలకవర్గం గడువు ముగుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు షెడ్యూల్ విడుదల కాకపోవడంతో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు నెలకొన్న తరుణంతో సిఎం కెసిఆర్ జూలైలో ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించడంతో పట్టణాలలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రిజర్వేషన్లు అనుకూలిస్తే పోటీ చేసేందుకు […] The post వచ్చే నెలలోనే మున్సిపల్ ఎన్నికలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

-సిఎం ప్రకటనతో వేడెక్కుతున్న రాజకీయం
– ఎంఎల్ఎల చుట్టూ ఔత్సాహికుల ప్రదక్షిణలు
ఆదిలాబాద్ ప్రతినిధి : మున్సిపాలిటీ పాలకవర్గ పదవీ కాలం వచ్చే నెలలో ముగుస్తుండడంతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వచ్చే నెల 3వ తేదీతో ప్రస్తుత పాలకవర్గం గడువు ముగుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు షెడ్యూల్ విడుదల కాకపోవడంతో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు నెలకొన్న తరుణంతో సిఎం కెసిఆర్ జూలైలో ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించడంతో పట్టణాలలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రిజర్వేషన్లు అనుకూలిస్తే పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నామంటూ ఔత్సాహికులు ఇప్పటికే తమ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారు. మున్సిపల్ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నిక కావాలనే ఉత్సాహంతో ఉన్నవారిలో ఎక్కువ మంది అధికార టిఆర్‌ఎస్ పార్టీ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఇప్పటికే తమ పేర్లను పరిశీలించాలని ఎంఎల్ఎ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అధికార పార్టీ టికెట్ దక్కని పక్షంలో ఏమి చేయాలనే విషయంపైనా తమ సన్నిహితులతో చర్చించడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఎంఐఎం, టిఆర్‌ఎస్ పార్టీలు మున్సిపల్ ఎన్నికలలో పొత్తు పెట్టుకొని కలిసి పోటీ చేస్తాయా లేక విడివిడిగా పోటీ చేస్తాయా అనే అంశంపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బిజెపిల నుంచే కాకుండా స్వతంత్ర అభ్యర్థులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు పలువురు ముందుకు రావడం గమనార్హం. ఇదిలాఉంటే రిజర్వేషన్లు ఖరారయ్యేంత వరకు ఎవరిని బరిలో నిలపాలనే విషయంపై స్పష్టత ఇవ్వలేని పరిస్థితి నెలకొనడంతో పార్టీల నేతలు గుంభనంగా వ్యవహరిస్తుండగా, వచ్చే పాలకవర్గంలో కౌన్సిలర్‌గా తాను ఎన్నికవడం ఖాయమంట పార్టీ ముఖ్య కార్యకర్తలు పేర్కొంటున్నారు. రిజర్వేషన్లు అనుకూలించని పక్షంలో పక్క వార్డుల నుంచి పోటీ చేసేందుకు సైతం ముందుకు వస్తున్నారు. ఇప్పటికే వార్డుల వారీగా ముఖ్య కార్యకర్తలు, వారి బలాబలాలతో కూడిన జాబితాను సిద్దం చేసుకున్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ విడుదలై రిజర్వేషన్లు ఖరారైన వెంటనే పార్టీ ఆధ్వర్యంలో సర్వే చేపట్టి టికెట్లను ఖరారు చేస్తామని ఎంఎల్ఎలు చెబుతున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలని అధికార టిఆర్‌ఎస్ పార్టీ భావిస్తోంది. ఇక పార్టీలో ముఖ్య నాయకులుగా వ్యవహరిస్తున్న వారు సైతం కొన్ని వార్డుల నుంచి అభ్యర్థుల విషయంలో సిఫారసులు చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. చైర్మన్ పదవితో పాటు వార్డులను ఎవరికి రిజర్వ్ చేస్తారనే విషయం తేలేంత వరకు బరిలో ఎవరిని నిలుపుతారనే విషయంపై స్పష్టత ఇవ్వలేమని వారు పేర్కొంటున్నారు.

Municipal Elections At Telangana In July

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వచ్చే నెలలోనే మున్సిపల్ ఎన్నికలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: