లాక్‌డౌన్‌పై నిర్లక్ష్యం: తమ్ముడిని చంపిన అన్న

ముంబయి: కరోనా లాక్‌డౌన్ హెచ్చరికలను పెడచెవిన పెట్టి బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన తమ్ముడిని అన్న హత్య చేసిన సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది. నిందితుడు 28 ఏళ్ల రాజేష్ లక్ష్మీఠాకూర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు దుర్గేష్ పుణెలోని ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి లాక్‌డౌన్ ఉందని బయటకు వెళ్ళొద్దని దుర్గేష్‌ను పదేపదే హెచ్చరించినా వినకుండా వెళ్లి డ్యూటీ చేసుకుని తిరిగి ఇంటికి వచ్చాడు. దీంతో అన్నదమ్ముల మధ్య వాగ్వాదం జరిగింది. వదిన కూడా […] The post లాక్‌డౌన్‌పై నిర్లక్ష్యం: తమ్ముడిని చంపిన అన్న appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: కరోనా లాక్‌డౌన్ హెచ్చరికలను పెడచెవిన పెట్టి బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన తమ్ముడిని అన్న హత్య చేసిన సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది. నిందితుడు 28 ఏళ్ల రాజేష్ లక్ష్మీఠాకూర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు దుర్గేష్ పుణెలోని ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి లాక్‌డౌన్ ఉందని బయటకు వెళ్ళొద్దని దుర్గేష్‌ను పదేపదే హెచ్చరించినా వినకుండా వెళ్లి డ్యూటీ చేసుకుని తిరిగి ఇంటికి వచ్చాడు. దీంతో అన్నదమ్ముల మధ్య వాగ్వాదం జరిగింది. వదిన కూడా భర్తకు తోడు వాగ్వాదానికి దిగింది. ఇది చివరకు ఘర్షణగా మారి పదునైన ఆయుధంతో దుర్గేష్‌పై రాజేష్ దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన దుర్గేష్‌ను సమీప ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు ప్రకటించారు.

Mumbai Man Killed by Brother due to not follow lockdown

The post లాక్‌డౌన్‌పై నిర్లక్ష్యం: తమ్ముడిని చంపిన అన్న appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: