ప్రియుడి కోసం ముంబయి నుంచి ఆదిలాబాద్.. ప్రియురాలు ధర్నా

Lover

 

ఆదిలాబాద్: ప్రియుడి కోసం ఓ యువతి ముంబయి నుంచి ఆదిలాబాద్ జిల్లా దస్తురాబాద్ మండలం బుట్టాపూర్‌కు చేరుకొని ధర్నా చేస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బెంగళూరుకు చెందిన ఓ యువతి తన తల్లిదండ్రులు చనిపోవడంతో అన్నదమ్ములతో కలిసి ముంబయిలో నివసిస్తోంది. ముంబయిలో ఓ భవంతిలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. దీంతో ఆ భవనంలో ఉన్న మహేశ్‌తో పరిచయం ఏర్పడింది. వీళ్ల పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని యువతిని మహేశ్ లోబర్చుకున్నాడు. తరువాత యువతి నిలదీయడంతో అక్కడి నుంచి తప్పించుకొని తన సొంతూరు బుట్టాపూర్‌కు వచ్చాడు. దీంతో యువతి తన ప్రియుడు కోసం వెతకడం ప్రారంభించింది. ప్రియుడు స్నేహితులను జాడ చెప్పాలని లేకపోతే పోలీస్ స్టేషన్‌లో కేసు పెడుతానని బెదురించడంతో వాళ్లు అడ్రస్ చెప్పారు. యువతి అతడి స్నేహితుల సహకారంతో దస్తురాబాద్ పోలీసులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. యువతికి స్థానిక మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. దీంతో బుట్టాపూర్‌లో మహేశ్ ఇంటి ఎదుట మహిళా సంఘాలతో కలిసి ఆ యువతి ధర్నాకు దిగింది. దీంతో స్థానిక సిఐ జయరాం, ఎస్‌ఐ అశోక్ అక్కడికి చేరుకొని మహేశ్ ను పిలుపించాలని అతడి తల్లిదండ్రులకు సూచించారు.

 

Mumbai Girl Strike for Lover in Adilabad

The post ప్రియుడి కోసం ముంబయి నుంచి ఆదిలాబాద్.. ప్రియురాలు ధర్నా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.