ఆలోచనాత్మక రసగుళికలు వారాల ముక్తకాలు

  ఒక చెట్టు నుండి పువ్వు రాలింది. అంటే ఆ చెట్టు ఒక పుష్పాన్ని త్యజించింది అని అర్థం. పూవు విడువబడింది అని అర్థం. పుష్పాలు సహజసిద్ధంగా రాలడం ఒక శాస్త్రం. జీవ పరిణామ శాస్త్రం, ప్రకృతి ప్రక్రియ. కోసిన పువ్వుకు, రాలిన పువ్వుకు ఉండే స్వల్ప వ్యత్యాసం గమనింపులోకి తెచ్చుకున్నప్పుడు రెండూనూ పరిమళభరితమైన పుష్పాలే అనేది మూల విషయం పరిధిలోకి వస్తాయి. కవి హృదయభావాలు ఒక్కొక్క భావ పరిమళంతో విడబడేవి కవితాపుష్పాలు. ఇవే ఈ ముక్తకాలు. […] The post ఆలోచనాత్మక రసగుళికలు వారాల ముక్తకాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఒక చెట్టు నుండి పువ్వు రాలింది. అంటే ఆ చెట్టు ఒక పుష్పాన్ని త్యజించింది అని అర్థం. పూవు విడువబడింది అని అర్థం. పుష్పాలు సహజసిద్ధంగా రాలడం ఒక శాస్త్రం. జీవ పరిణామ శాస్త్రం, ప్రకృతి ప్రక్రియ. కోసిన పువ్వుకు, రాలిన పువ్వుకు ఉండే స్వల్ప వ్యత్యాసం గమనింపులోకి తెచ్చుకున్నప్పుడు రెండూనూ పరిమళభరితమైన పుష్పాలే అనేది మూల విషయం పరిధిలోకి వస్తాయి. కవి హృదయభావాలు ఒక్కొక్క భావ పరిమళంతో విడబడేవి కవితాపుష్పాలు. ఇవే ఈ ముక్తకాలు. ఈ ముక్తకాలకు మరో అందాన్నిచ్చే అంతర్గత భావాన్ని పాఠకుల హృదయ స్పందనలకే వదలబడిన భావ గుళికలు.ఈ గుళికల్ని అందుకోవాల్సిన హృదయఔన్నత్యం, సహృదయ సంపన్నత పాఠకులకు ఉండాలి.

“సగం ప్రశ్న సగం జవాబు సగం నిద్ర సగం మెలకువ
హారంలో దారంలా కాలం అల్లుకుంటూనే వుంది.”
ఒక్క ‘కాలం అల్లుకుంటూనే వుంది’ అనే కవిత్వం చాలు. జీవితం మొత్తం పూలదండై మనముందు నిలుపుతుంది. మనోవికారాది, సంస్కారాది భావాలన్నీ ‘సగం’తోనే మొత్తం అర్థం చేయించడానికి కవి అందుకున్న మంత్రదండం ‘కాలం’. ఇదీ పూల హృదయాల నుండి బయలుదేరి ముళ్ళువేస్తుంది. ఇదీ ముక్తకం. పాఠకులు ఎంత విప్పుతే అంత! పాఠకులు ఎంత కప్పితే అంత! దీనికి ఎంతైనా జోడించుకోవచ్చు.

ఇటువంటి నూట ఇరవై ముక్తకాలను ఒక్కచోట చేర్చి 2019 డిసెంబర్‌లోనే వారాల ఆనంద్‌గారు ‘ముక్తకాలు’ (వీ్‌శ్రీ) పేర ఒక పుస్తకాన్ని ముద్రించారు. దీనిని అనురాధ బొడ్లగారు ఇంగ్లీష్‌లోకి అనువదించారు. అసలు ముక్తకాలను, అనువాదాలనూ రెండూ ఒకేచోట అందిస్తున్న పుస్తకమిది.
“గాలి కదలికకో ఆకు సవ్వడికో ఏకాగ్రత చెడితే
నేరం మనసుదే గాలిన ఆకునో నిందించకు
When a gentle wind or a cracking
leaf disturbs your focus
Never blame the wind or a leaf, our
mind is at fault.
ఆకు సవ్వడి Crackting leaf, gentle wind నెమ్మదైనగాలి ఇవ్వి చేసే సందడికే నీ Focusను నీ ఏకాగ్రతకు చెడగొడితే ఎట్లా? అంటే తాము చేసే పనులకు ఏవో చిన్న సాకులు చెప్పి తప్పించుకుంటే ఎట్లా? ఓ గమ్యం ఉండాలి. ఓ ధ్యేయం ఉండాలి. తప్పులెదకేవారికి చురకగా ఈ గుళిక.

“నిజంగానే నాదొక వేదన కనిపించని రోదన
కారణాలు వెతుకుతావెందుకు నా కళ్ళు చెప్పడంలేదా. ఈ ముక్తకాన్ని అనురాధగారు In fact my anguish is an unseen agony
Search! not for reasons, my eye, reveal it quietly చక్కని అనువాదం. దీన్నే భాషాంతరీకరణం అంటాం. దీన్ని సంస్కృతంలో ‘పునఃకథనం’ అంటారు. అసలు కవి స్వేచ్ఛగా రాస్తాడు కవిత్వాన్ని. దాన్ని అనువాదకులు అంతటి స్వేచ్ఛగా రాయలేరు. మూలకవి భావాల్లో ఒదిగిపోవాలి అనువాదం. “కనిపించని వేదనను ఎక్కడ పట్టుకుంటావు? ఎట్లా ()పట్టుకుంటావు. కారణాలేం వెదుకుతావు? నా కళ్ళు చెప్పడం లేదా?” అంటూ exprission is the most powerfull feeling them అనే విషయాన్ని అద్భుతంగా వారాల ఆనంద్‌గారు చెబితే అంతే అద్భుతంగా అనురాధగారు అనువదించారు. ఇంకా చెప్పాలంటే కొంత స్వేచ్ఛను కూడా తీసుకున్నారు. ప్య్రక్ష విధానంలో కవి వాక్యాలుంటే పరోక్ష విధానంలోకి (కవి భావం చెడకుండా) మలిచారు. అనువాద కవయిత్రి, ఇట్లాంటి అనువాదాలు ఈ పుస్తకంలో చాలానే ఉన్నాయి. కవి హౄయదయంలోని సంఘర్షణను, అంతర్గత భావాన్ని ఇట్లా అందించగలిగితే, ఆ అనువాద రచననే మూలరచనగా భాసిల్లుతుంది. కేవలం ఈ ఇంగ్లీషు వాక్యాలను ఒక్కచోట చేర్చితే ఒక స్వతంత్ర రచనలానూ అగుపిస్తుంది. ఈ ముక్తకాల పుస్తకం ఇంగ్లీషులోని ఈ అనువాదాన్ని చదివి మూలరచన కోసం తపన పడే పాఠకులకు ఇట్లా తెలుగు, ఇంగ్లీషు ఒక్కచోటే దర్శనమిస్తే ఇదిగో ఇంత బావుంటుంది.

కవి, కథకులు, రచయిత, ఫిల్మ్‌మేకర్, వ్యాఖ్యాత… ఇలా విభిన్న రూపాల్లో వారాల ఆనంద్‌గారు మనకు కనిపిస్తారు. స్వయంగా ‘ఇరుగు పొరుగు’ కవిత్వానువాదంతో పలకరిస్తుంటారు. అక్షరాల తెరలపై కవులెందరినో చూపిస్తుంటారు… అక్షరాల చెలిమె, మనిషిలోపల వంటి కవితాసంపుటాలను వెలువరించిన వారాల ఆనంద్‌గారిది విలక్షణమైన కవిత్వం.
Keep your eye lids open / Nature may drop in your eyes…. Keep your heart open/
a man of soul / may come and leave / A signature of lone. అంటూ అద్భుతమైన కవిత్వాన్ని వ్రాసే వారాల ఆనంద్‌గారి ఈ ముక్తకాలను అంతే అద్భుతంగా ఇంగ్లీష్‌లోకి అనువాదంచేసిన అనురాధ బొడ్లగారు ఇరవై ఏళ్ళ బోధనానుభవంతో ఇంగ్లీష్ భాషాశాస్త్రంపై మంచి పట్టును సాధించుకున్నవారు. అనువాదకులు ప్రత్యేకంగా ఎవరి సాహిత్యాన్నైతే అనువదిస్తారో ఆ సాహిత్యంలోని ‘విషయానికి’ గౌరవాన్ని తీసుకురావాలి. దీన్ని శబ్దగౌరవాన్ని కూర్చడం అంటాం. అనువాదాల్లో శబ్ధ ప్రధానమైనవీ, అర్థప్రధానమైనవీ, ఉభయప్రధానమైనవి అను మూడురకాలు ఉన్నవి కదా, వీటిలో భావానికి న్యాయంచేసే అనువాదాన్ని అర్థప్రధానమైనవిగానూ, రెండూ రూపాలకూ ప్రాధాన్యత ఇస్తే దాన్ని ఉభయప్రధానమైన అనువాదమంటాం. స్థూలంగా ఇవ్వి మూలరచనలోని స్వభావాన్ని తాము ఎంచుకున్న అనువాద భాష అనే గొంతుకతో వినిపించాలి. అనువాద వినిమయానికి తేలికగా ఉండే భాషను ఉపయోగించాలి. అట్లా అని భాషా సౌందర్యానికి దెబ్బరానీయవద్దు. ఇన్ని అంశాలుంటాయి.

మానవ సంబంధాలకు అత్యంత ప్రాధాన్యత నిచ్చే వారాల ఆనంద్‌గారు రాసే కవితలు సామ్జాక విలువలు కాపాడుతూ ఔత్సాహికులకు దిక్సూచిలా ఉంటాయి.
“ద్వేషం ఎంత చెడ్డదంటే ఎదుటివారితో ఆగదు
నిన్ను కూడా దహించి వేస్తుంది.
ప్రేమ ఎంత గొప్పదంటే నీ మనసునే కాదు
ఎదుటివారినీ వెలిగిస్తుంది” అంటూ ప్రేమ భావపు విలువలు ఎంత గొప్పవో చెబుతారు. ఆనంద్‌గారి ఈ ముక్తకాన్ని అనురాధగారు
Hatred so deadly that at won’t stop with
Others but burns you too.
Love is So great that it illunenes
Not only you but other tor.

అంటూ Hatred feeling అనేది ఇతరులనే కాదు నిన్నూ దహించి వేస్తుంది అనడం గొప్ప కవిత్వమే కాదు, గొప్ప నీతిసూత్రాన్ని ‘ప్రేమ’ “ఎదుటివారినీ వెలిగిస్తుంది” అంటారు కవి. సాహిత్యం అంటేనే జీవనం. అసలు రచనల్లోనూ, అనువాద రచనల్లోనూ ఉండేది పాఠక లోకమే! అక్కడ చలనం రావాలి. సంస్కృతీ సాహిత్యం పెనవేసుకొని ఉంటాయి. కొత్త పదబంధాలను సృష్టించాలి. ఆకట్టుకోవాలి. ఇది కవులకన్నా అనువాదలకు కత్తిమీద సామే తెలుగువాళ్ళకు ఇంగ్లీష్ శాబ్దిక స్నేహం బాగానే ఉన్నది కాబట్టి మధుర తేనీయాన్ని తాగినట్టే అనువాద కవిత్వాన్ని ఆస్వాదిస్తారు. ఒకప్పుడు ప్రత్యక్షంగా మనను ఏలిన ఇంగ్లాండ్ ఇంగ్లీషూ, ఇప్పుడు పరోక్షంగా మనను ఏలుతున్న అమెరికా ఇంగ్లీషూ కొంత వైరుధ్యంతో ఉన్నా ప్రపంచానికి మంచి సాహిత్యాన్ని అందించే పనిచేస్తున్నారు అనువాదకులు.

ఆనంద్‌గారు రెండేసి పంక్తుల్లో రాసి చూపిన ఈ కవితలను నమిలి కొండ హరిప్రసాద్‌గారు ముక్తకాలు, అంటే ముత్యాలు అన్నారనీ అదే పెరు పెట్టాననీ అనడం నిజంగా సముచితం!
“జరుగుతున్న విచ్ఛిన్నాన్ని చూసి పచ్చదనం పారిపోయింది దూర తీరాలకు, మనిషేమో నిలిచిపోయాడు నీడలేక, శ్వాస లేక” అంటూ పర్యావరణాన్ని పాడుచేస్తున్న మనిషి నీడనే కాదు శ్వాసనూ కోల్పోతున్నాడని ఆలోచనాత్మకంగా రాశారు ఆనంద్‌గారు.
“కాలానికి అలసట తెలీదు, నాకేమో గమ్యం తెలీదు” “మంచి కవిత్వం అమ్ముడుపోతుందా ఎక్కడయినా, మనస్సుని కప్పుకుపోతుంది ఎప్పుడయినా” “దుఃఖం నాకు ఆత్మీయురాలే, నన్ను శుభ్రంచేసి మరీపోతుంది”, “జనన మరణాలు కాదు, జీవితమే నిజం”, “చీకటి వెళ్తుర్లని కాలం గుమ్మరించినట్టు” “జలధుల్నీ ఈదొచ్చు, ‘ప్రేమ’లేని మనసుని చేరడమే కష్టం”, “మాయ కమ్మేస్తే ‘మనం’ తీరానికి చేరేదెట్లా” అంటూ గొప్ప తాత్వికతను దర్శింపచేయడం కవిగా ఆనంద్‌గారి ఔన్నత్యాన్ని వ్యక్తపరుస్తున్నది.

“అడ్డగోలు నిర్మించడానికి వేరెవరో అక్కరలేదు
స్నేహశూన్యత, ప్రేమ రాహిత్యాలు చాలు” అని చెప్పడమైనా, “సున్నితత్వం, బలహీనతో చేతకానితనమో కాదు / శక్తివంతమయిన ఆత్మవిశ్వాస ప్రతిబింబం” అని చెప్పడమైనా వ్యక్తిత్వ వికాసానికి ఇట్లాంటి మాటలు చదివితే చాలు.
మట్టితోనూ నీటితోనూ మానవ శరీరం నిర్మితమైందని చెప్తూ రాసిన కవిత్వమైనా ఓటమి ఎంతటి ఓరుపునిస్తుందో తెలుపడమైనా, ఓటమో బలహీనతో పుట్టుక నుంచి కాదని చెప్పడమైనా, మనుషులు కొందరు వెలుగులు తీసుకొస్తే, కొందరు మోసుకెళ్తారనడమైనా, దుఃఖాన్ని చీకటితో పోలుస్తూ రాయడం వంటివన్నీ వారాల ఆనంద్‌గారిలో ఒక తాత్వికుడు కొంత ఆధ్యాత్మిక భావ సరళిలో కవిగా మసలు కుంటారని అర్థమౌతున్నది. మౌక్తికమాల తెలుగు భాషామతల్లిని అలంకరిస్తుంది అనడంలో సందేహం లేదు. వారాల ఆనంద్‌గారికి అభినందనలు.

Mukthakalu Poetry Book Written By Varala Anand

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆలోచనాత్మక రసగుళికలు వారాల ముక్తకాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: