ఆ రహస్యం చెబితే నన్ను తప్పిస్తారు: ధోనీ

MS Dhoniచెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ప్రారంభం నుంచి మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్(సిఎస్కే) జట్టు ప్రతి సీజన్ లోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోవడం కామన్ గా మారిపోయింది. ప్రతీసారి ప్లేఆఫ్ కు చేరడం చెన్నైకి అలవాటుగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదేమో. ఈ సీజన్ లోనూ సిఎస్కే దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచుల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మంగళవారం సొంత మైదానంలో హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో షేన్ వాట్సన్ (96 పరుగులు) చెలరేగడంతో చెన్నై మరో ఘన విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో సీజన్-12లో ప్లేఆఫ్‌కు చేరుకున్న మొదటి జట్టుగా చెన్నై నిలిచింది. నిన్నటి మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ ధోనీతో వ్యాఖ్యాత హర్షబోగ్లే మాట్లాడుతూ… ప్రతి ఐపిఎల్ లో సిఎస్కే అద్భుతంగా రాణిస్తూ ప్లేఆఫ్ కు చేరుకోడంలో రహస్యమేంటని అడిగాడు. దీనికి మహీ ఫన్నీగా సమాధానం చెప్పాడు.

ఇది తమ జట్టుతో మాత్రమే షేర్ చేసుకునే రహస్యమని, దీన్ని బయటపెడితే వచ్చే ఏడాది ప్రతి జట్టు అదే పార్ములాను పాలో అవుతూ తమను దెబ్బతీసే ప్రమాదముందని, దీంతో చెన్నై యాజమాన్యం నన్ను జట్టులోంచి తప్పించవచ్చని…కాబట్టి ఆ రహస్యాన్ని భయటపెట్టలేని  ధోని చమత్కరించాడు. కానీ రిటైర్మెంట్ తర్వాత తప్పకుండా చెప్తానని మహేంద్రుడు ఫన్నీగా సమాధానం చెప్పాడు. మహీ సమాధానానికి నవ్వుతున్న హర్షతో ధోనీ మళ్లీ మాట్లాడుతూ… జట్టు విజయ రహస్యమంటూ ఏమీ లేదని, ఆటగాళ్లందరు సమిష్టిగా విజయం కోసం రాణించడమే తమ రహస్యమన్నాడు. అభిమానుల మద్దతు, యాజమాన్యం ఇచ్చిన ప్రోత్సాహం, జట్టు సహాయక బృందం కూడా తమ కోసం ఎంతో శ్రమిస్తుందని ఇవే తమ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎంఎస్ చెప్పుకొచ్చాడు.

MS Dhoni Funny Comments on CSK Victory Secrete

The post ఆ రహస్యం చెబితే నన్ను తప్పిస్తారు: ధోనీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.