కందుకూరు కాంగ్రెస్‌లో లుకలుకలు

ఇప్పటికే క్యాడర్ సగం కాళీ ఉన్న వారిలో బిసి వర్గాలను ఎదగకుండా చేస్తున్న వైనం స్థానికసంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపనున్న అసంతృప్తి నేతలు కందుకూరు: మహేశ్వరం నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అమవాస్య మేఘాలు కమ్ముకుంటున్నాయి. కందుకూరు మండల నేతల మద్య సమన్వయ లోపించడం బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన నేతలను ఎదగకుండా సీనియర్ నేతలు పార్టీలో అనగతోక్కడం వంటి సమస్యలతో కార్యకర్తలు, నాయకులు అసంతృప్తి సేగలు చూపుతున్నారు. దీనికి […] The post కందుకూరు కాంగ్రెస్‌లో లుకలుకలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఇప్పటికే క్యాడర్ సగం కాళీ
ఉన్న వారిలో బిసి వర్గాలను ఎదగకుండా చేస్తున్న వైనం
స్థానికసంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపనున్న అసంతృప్తి నేతలు

కందుకూరు: మహేశ్వరం నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అమవాస్య మేఘాలు కమ్ముకుంటున్నాయి. కందుకూరు మండల నేతల మద్య సమన్వయ లోపించడం బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన నేతలను ఎదగకుండా సీనియర్ నేతలు పార్టీలో అనగతోక్కడం వంటి సమస్యలతో కార్యకర్తలు, నాయకులు అసంతృప్తి సేగలు చూపుతున్నారు.

దీనికి తోడు మహేశ్వరం నుండి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటి చేసి గెలిచిన సబితాఇంద్రారెడ్డి అభివృద్ది కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలకు ఏలాంటి అండదండలు లేకపోవడం స్థానిక నాయకులు మరీంత నిరాశనిస్పుహలకు గురవుతున్నారు. పార్టీలో సేవచేసిన వారికి ఏలాంటి గుర్తింపు లేకపోవడం మూలంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చేప్పి గులాబీ కండువాలు కప్పుకుంటున్నారు. ఇప్పటికే అలా కాంగ్రెస్ పార్టీలో క్యాడర్ మేల్లమేల్లగా తగ్గుతూ వెళ్ళపై లేక్కించే విధంగా మారింది తంతు. గత ముందు రోజు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీలో కొనసాగుతున్న కొందరూ నేతలు సమావేశంలో మేల్లమేల్లగా ఎదుగుతున్న వారిని ఎదగకుండా కొందరూ నాయకులు పార్టీలోనే అనిచివేయడం సరికాదని తమ ఆవేదనను వెళ్లుబుచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతుటం అందులో పార్టీ భి పాంలను అందుకోవడానికి నేతలు ఎత్తుకుపై ఎత్తులు వేస్తూ తమకు అనుకూలంగా ఉన్న వారికి, తమ చేప్పుచేతుల్లో వుండే నేతలకు ఇవ్వడానికి చూస్తున్నట్లు సమాచారం. పార్టీ పెద్ద పదవుల్లో, అభ్యర్థుల ఎంపికలో ఒకే వర్గానికి చెందిన వ్యక్తులు ఒక్కొక్కరు రెండు మూడు పదవులు తీసుకోని అధికారాన్ని చలాయిస్తున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు. జడ్పీటిసి పదవి కుడా ప్రస్తుతం కోనసాగుతున్న నాయకుడే మల్లి కోరడం, కొత్తవారికి స్థానం కల్పించమని అడిగిన ఏలాంటి స్పందన లేకపోవడంతో కొందరిలో పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు అనూకూలంగా లేని వారికి ఎంపిటిసి ఎన్నికల్లో అనుకూలంగా మలుచుకోని ఏదగడానికి ఒక ప్లాట్‌ఫాంగా భావించిన వారికి అందనిదాక్ష లా మారిపోతుందని భావిస్తున్నారు.

ఎన్నొ రోజులుగా పార్టీలో రాత్రిబ్రవళ్లు పనిచేసిన వ్యక్తులు న్యాయం చేసే పెద్దదిక్కులేకుండా పోయిందిని ఉన్న క్యాడర్‌లో బలంగా వున్న వారు ఇతర పార్టీలకు జంప్‌చేసి ఎవ్వరిదారి వారుచుసుకోగా ఆర్థికంగా బలంగా లేని నేతలు పార్టీని విడలేక అయోమయంలో పడుతున్నారు. మండలంలో మొత్తం 16 స్థానాలలో పోటీ జరుగుతుండగా కొందరిని బుజ్జగించి అభ్యర్థులను ప్రకటించిన ఫలితాలు వెలువడే వరకు పార్టీలో ఉన్న క్యాడర్ కాస్త కాళీ అయి పార్టీని విడిచిపెట్టి పోయే అవకాశాలు లేకపోలేదు.

 

mptc zptc elections 2019

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కందుకూరు కాంగ్రెస్‌లో లుకలుకలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: