గ్రామాల్లో ఎన్నికల వేడి

హాలియా(నల్లగొండ) : గ్రామాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ వేడి మొదలైంది. అప్పుడే రాజకీయ నేతలు ఎన్నికల సందడిలో మునిగి తేలుతున్నారు. చోటా, మోటా టిఆర్ఎస్  నాయకులు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. దీని బాధ్యత ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కెసిఆర్ అప్పగించారు. పార్టీ ముఖ్య నేతల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ నేతలు పోటీ చేయనున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని అనుముల, పెద్దవూర, […] The post గ్రామాల్లో ఎన్నికల వేడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హాలియా(నల్లగొండ) : గ్రామాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ వేడి మొదలైంది. అప్పుడే రాజకీయ నేతలు ఎన్నికల సందడిలో మునిగి తేలుతున్నారు. చోటా, మోటా టిఆర్ఎస్  నాయకులు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. దీని బాధ్యత ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కెసిఆర్ అప్పగించారు. పార్టీ ముఖ్య నేతల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ నేతలు పోటీ చేయనున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని అనుముల, పెద్దవూర, తిరుమలగిరి(సాగర్), గుర్రంపోడు, నిడమనూరు, త్రిపురారం మండలాల్లోని ఆరు జడ్పీటీసీ స్థానాలకు, 67 ఎంపిటిసిలతో పాటు మాడ్గులపల్లి మండలంలోని 3 ఎంపిటిసిలకు  కలిపి సాగర్ నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహిస్తుండగా, ఇందులో భాగంగా సాగర్ నియోజకవర్గ పరిధిలో మొదటి విడతలో గుర్రంపోడు మండలం, రెండవ విడతలో అనుముల, పెద్దవూర, తిరుమలగిరి(సాగర్), నిడమనూరు, త్రిపురారం మండలాలు. మాడ్గులపల్లి మండలం మూడవ విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. జడ్పీటీసీ, ఎంపిటీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికల వేడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడంతో ఆయా పార్టీలకు చెందిన పోటీదారులు తెరపైకి వస్తున్నారు. ఈసారి పోటీ చేసేందుకు యువకులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపిటీసీల అభ్యర్ధులను ఖరారు చేసేందుకు ఆయా రాజకీయ పార్టీల్లో చర్చలు కొనసాగుతున్నాయి. పరిషత్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కాయి. పోటీలో నిలిచే వ్యక్తులు తన పేరును ఖరారు చేయాలని ఆయా పార్టీల అగ్రనేతల చుట్టూ తిరుగుతున్నారు. ఆయా పార్టీల నాయకులు కులాలవారీగా అభ్యర్ధులను ఎంపిక చేసే పనిలో పడ్డారు. జనవరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటో చేసి ఓడిపోయిన వారు సైతం తిరిగి ఎంపీటీసీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏదిఏమైనప్పటికీ ఈసారి మాత్రం గతంలో జరిగిన ఎన్నికల పరిస్థితులకు పూర్తి భిన్నంగా మారబోతున్నాయి. నియోజకవర్గం నుంచి అత్యధిక శాతం అధికార టిఆర్‌ఎస్ నుంచే పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపిటీసీ పోటీచేయాలన్నా వ్యక్తులు పట్టణాలు, ఇతరత్రా ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఇప్పటికే తమ స్వంత గ్రామాలకు చేరుకుని బంధుమిత్రులను, గ్రామస్తులను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు.

MPTC and ZPTC Elections Heat in Villages

The post గ్రామాల్లో ఎన్నికల వేడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: