దొడ్లు కడగడానికి ఎంపీ కాలేదు

 

Thakur
భోపాల్: మరుగుదొడ్లు, మురుగు కాలువలు శుభ్రం చేయడానికి తాను ఎంపీ కాలేదంటూ వ్యాఖ్యానించి భోపాల బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వివాదంలో చిక్కుకున్నారు. ఎంపీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. కేంద్రంలోని బీజేపీ చేస్తున్న స్వచ్ఛభారత్ ప్రచారంలోని అసలు డొల్లతనం ఆ పార్టీ ఎంపీ వ్యాఖ్యలతో బయటపడిందని కాంగ్రెస్ విమర్శించింది. ఆదివారం పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రజ్ఞాసింగ్ మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో అభివృద్ధిని సాధించేందుకు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల, ప్రజాప్రతినిధులతో కలసి పనిచేయడమే ఎంపీ బాధ్యతని చెప్పారు. మాలేగావ్ పేలుళ్లలో నిందితురాలైన ప్రజ్ఞాసింగ్ ప్రస్తుతం బెయిల్‌పై విడుదలై ఎంపీగా గెలిచారు. మరుగుదొడ్లు కడగడానికి, మురుగు కాలువలు శుభ్రం చేయడానికి మనం గెలవలేదన్న విషయం మీరు గుర్తుంచుకోండి. మన బాధ్యతలను మనం నిజాయితీగా చేద్దాం. ఇదే విషయాన్ని గతంలో చెప్పాను. ఇప్పుడూ చెబుతున్నాను. భవిష్యత్తులో కూడా నా వైఖరి ఇదే” అని ఆమె స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శోభా ఓజా విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల బీజేపీ ఎంపీల చిత్తశుద్ధికి ఇంతకన్నా నిదర్శనం ఏమిటని ఆమె ప్రశ్నించారు.

MPs will not Clean Toilets, says, BJP MP, Bhopal MP Pragya Singh Thakur statement kicked up a controversy as Congress slams the MPs comments

Related Images:

[See image gallery at manatelangana.news]

The post దొడ్లు కడగడానికి ఎంపీ కాలేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.