కీసర అడవిని దత్తత తీసుకున్న ఎంపి సంతోష్‌

హైదరాబాద్ : ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటంలో ముందుండే టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ మరో మంచి నిర్ణయం తీసుకున్నారు. టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ పుట్టినరోజు(జులై 24) సందర్భంగా కీసరగుట్ట రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. తన సొంత ఖర్చులతో ఈ అడవిని ఆయన అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు ఎంపి సంతోష్‌ కుమార్‌ ట్విట్ చేశారు. తన పుట్టిన రోజు సమాజహితం కోసం మంచి పని చేయాలని […] The post కీసర అడవిని దత్తత తీసుకున్న ఎంపి సంతోష్‌ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటంలో ముందుండే టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ మరో మంచి నిర్ణయం తీసుకున్నారు. టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ పుట్టినరోజు(జులై 24) సందర్భంగా కీసరగుట్ట రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. తన సొంత ఖర్చులతో ఈ అడవిని ఆయన అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు ఎంపి సంతోష్‌ కుమార్‌ ట్విట్ చేశారు. తన పుట్టిన రోజు సమాజహితం కోసం మంచి పని చేయాలని కెటిఆర్‌ పిలుపునిచ్చిన సంగతి విషయం తెలిసిందే. కెటిఆర్‌ ఇచ్చిన గిఫ్ట్‌ ఏ స్మైల్‌ నినాదాన్ని ఎంపి సంతోష్‌ స్ఫూర్తిగా తీసుకుని కీసర అడవిని దత్తత తీసుకున్నారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని ఈ సందర్భంగా సంతోష్ పిలుపునిచ్చారు. అడవుల అభివృద్ధి, అర్బన్ లంగ్ స్పేస్ ల అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఆయన పలువురు ప్రముఖులను ట్వీట్టర్ ద్వారా ఆహ్వానించారు.

MP Santosh Adopted Keesara Forest

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కీసర అడవిని దత్తత తీసుకున్న ఎంపి సంతోష్‌ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: