కీసరగుట్టను సందర్శించిన ఎంపి సంతోష్ కుమార్

 

హైదరాబాద్‌: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఎంపి సంతోష్‌ కుమార్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నిర్విరామంగా కొనసాగాలని, ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని రామలింగేశ్వరస్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ఎంపి సంతోష్ కుమార్ తోపాటు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్‌ రావు, శంబీపూర్‌ రాజు, ఎంఎల్ఎ వివేకానంద కీసరగుట్టను సందర్శించారు.

MP Santhosh Kumar visits Keesaragutta

 

The post కీసరగుట్టను సందర్శించిన ఎంపి సంతోష్ కుమార్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.