సిఎంకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వల్ల ఆరుగురు చనిపోవడం కలవరపెడుతోందని, కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపి రేవంత్‌రెడ్డి.. సిఎం కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో రేవంత్‌రెడ్డి మరిన్ని అంశాలను ప్రస్తావించారు. ఒక పక్క సామాజిక దూరం పాటించమని చెప్తూ మరోపక్క ఫార్మాసిటీ భూసేకరణకు నోటీస్‌లు ఇవ్వడం, కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి పంపింగ్ కోసం టెండర్లు పిలవడం వంటివి లాక్‌డౌన్ ప్రకటించిన కారణంగా సముచిత నిర్ణయాలు కాజాలవన్నారు.

ప్రజా ప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారులు, ఉన్నత ఉద్యోగంలో ఉన్న వాళ్ల జీతాల కోత విషయంలో నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని.. కానీ, చిన్న ఉద్యోగులు, నాలుగువ తరగతి ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతంలో కోత విధిం చడం సరైంది కాదన్నారు. ఉన్నత ఉద్యోగులను, చిరు ఉద్యోగులను ఒక గాటిన కట్టడం కరెక్ట్ కాదన్నారు. వైద్య పారామెడికల్ సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని, వాళ్లక ప్రోత్సాహాకాలు ఇవ్వాలి కానీ జీతాల్లో కోత పెట్టడం వారి నిబద్ధతను తక్కువ చేయడమేనన్నారు. పై నిర్ణయాలన్నింటినీ పునః సమీక్షించాలని ఆ లేఖలో రేవంత్ డిమాండ్ చేశారు.

MP Revanth Reddy writes to CM KCR

The post సిఎంకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.