aట్రాఫిక్ నియమాలు పాటిస్తే సినిమా టికెట్లు!

  నగర ట్రాఫిక్ పోలీసుల పిలుపు జూబ్లీహిల్స్‌లో వాహనదారులకు అవగాహన తనిఖీల్లో పట్టుబడిన ఆటోకు 62 చలాన్లు హైదరాబాద్ : ట్రాఫిక్ నియమాలు పా టించండి… పివిఆర్ సినిమా టిక్కెట్టు పొందండి… అంటూ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు పిలుపునిచ్చారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లో వాహనదారుల కు ట్రాఫిక్ నియమాలను వివరిస్తూ, సినిమా టిక్కెట్లు వచ్చే అవకాశాలను వాహనదారులకు తెలియపరిచారు. మీరు ట్రాఫిక్ పోలీసు కళ్ళు గప్పి ఎన్నిమార్లు డుపికీ కొట్టినా ఏదో ఒక రోజు పోలీసులకు దొరుకుతారు. అందుకు […] The post aట్రాఫిక్ నియమాలు పాటిస్తే సినిమా టికెట్లు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నగర ట్రాఫిక్ పోలీసుల పిలుపు
జూబ్లీహిల్స్‌లో వాహనదారులకు అవగాహన
తనిఖీల్లో పట్టుబడిన ఆటోకు 62 చలాన్లు

హైదరాబాద్ : ట్రాఫిక్ నియమాలు పా టించండి… పివిఆర్ సినిమా టిక్కెట్టు పొందండి… అంటూ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు పిలుపునిచ్చారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లో వాహనదారుల కు ట్రాఫిక్ నియమాలను వివరిస్తూ, సినిమా టిక్కెట్లు వచ్చే అవకాశాలను వాహనదారులకు తెలియపరిచారు. మీరు ట్రాఫిక్ పోలీసు కళ్ళు గప్పి ఎన్నిమార్లు డుపికీ కొట్టినా ఏదో ఒక రోజు పోలీసులకు దొరుకుతారు. అందుకు ఉదాహారణే.. శుక్రవారం పట్టుకున్న ఓ ఆటో అంటూ తెలిపారు. ఆ ఆటో నెం. టిఎస్ 07 యుఎ 8170 నియమాలను ఉల్లంఘిస్తూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతూ మొత్తం 62 చాలాన్ల భారిన పడిందని తెలిపారు.

62 మార్లు తప్పించుకున్నా… పోలీసులకు దొరికాడు. ఇలా తప్పించుకు తిరిగే కన్నా.. నియమాలను పాటిస్తూ యదేచ్చగా నగరంలో ప్రయాణం సాగించండి… పివిఆర్ సినిమా టిక్కెట్లను గెలుచుకుని వినోదాన్ని ఆస్వాదించండి అంటూ నగర ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. నగరాన్ని ప్రమాద రహిత నగరంగా మనమందరం మార్చుకుందాం అంటూ ట్రాఫిక్ పోలీసు పరిపాలనా అధికారి రాజు పిలుపునిస్తున్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ రహదారిలో వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో అటువైపుగా వచ్చిన ఆటోను ఆపి నెంబర్ ఆధారంగా ఆన్‌లైన్‌లో తనిఖీ చేయగా 62 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. వెంటనే ఆ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. చలాన్లకు విధించిన జరిమానా కట్టిన తర్వాతే తీసుకు వెళ్లాలని డ్రైవర్‌కు చెప్పారు.

Movie ticket is your own if you follow the Traffic rules

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post aట్రాఫిక్ నియమాలు పాటిస్తే సినిమా టికెట్లు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: