క్షణికావేశానికి ఇద్దరు చిన్నారుల బలి

  రంగుల్లో కలిపే మిశ్రమాన్ని తాగించిన తల్లి భార్యాభర్తల నడుమ గొడవలే కారణం మనతెలంగాణ/శామీర్‌పేట : క్షణికావేశంలో ఓ తల్లి తన పిల్లలకు రంగులలో కలిపే మిశ్రమాన్ని తాగించి తాను తాగి ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారకమైన సంఘటన శామీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. కర్నూల్ జిల్లా అదోని గ్రామానికి చెందిన గోపినాథ్ వరంగల్‌లోని అనాధాశ్రమంలో పెరిగిన ప్రీతితో 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. గత […] The post క్షణికావేశానికి ఇద్దరు చిన్నారుల బలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రంగుల్లో కలిపే మిశ్రమాన్ని తాగించిన తల్లి
భార్యాభర్తల నడుమ గొడవలే కారణం

మనతెలంగాణ/శామీర్‌పేట : క్షణికావేశంలో ఓ తల్లి తన పిల్లలకు రంగులలో కలిపే మిశ్రమాన్ని తాగించి తాను తాగి ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారకమైన సంఘటన శామీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. కర్నూల్ జిల్లా అదోని గ్రామానికి చెందిన గోపినాథ్ వరంగల్‌లోని అనాధాశ్రమంలో పెరిగిన ప్రీతితో 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. గత సంవత్సరం క్రితం మండలంలోని మజీద్‌పూర్ పరిధిలోని ప్రజయ్‌హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు. తుర్కపల్లి సమీపంలోని ఓ ఫార్మాకంపనీలో ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నాడు. వీరికి ఇద్దరు కూమారులు కౌషిక్(4), గౌరవ్(2)లు ఉన్నారు. భార్యాభర్తలు తరచు గొడవ పడేవారు. గొడవ పడిన సమయంలో ప్రీతీ పెరిగిన ఆశ్రమానికి వెళ్లి ఉండేది.

మంగళవారం రాత్రి తిరిగి భార్యాభర్తలకు గొడవ జరిగింది. ఉదయం రోజు మాదిరిగానే భర్త ఉద్యోగానికి వెళ్లాడు. మధ్యాహ్నం తరువాత వచ్చి చూసేసరికి ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా పడిఉన్నారు. భార్య ప్రీతిని ఏమి జరిగిందని భర్త అడగగా మందు తాగామని, మేము చనిపోతామని తెలపడంతో స్థానికుల సహాయంతో వెంటనే మెడిసిటి ఆస్పత్రికి తరలించగా వారు ఆస్పత్రిలోకి అనుమతించలేదు. మేడ్చల్‌లోని లీలా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా చిన్నారులు ఇద్దరు మృతి చెందారని తెలిపారు. ప్రీతీ పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. చిన్నారులను ఇద్దరిని పోస్టుమార్టుం నిమిత్తం గాంధీ మార్చరీకి తరలించారు. ఈ మేరకు శామీర్‌పేట ఇన్స్‌పెక్టర్ సంతోషం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post క్షణికావేశానికి ఇద్దరు చిన్నారుల బలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: