అమృత వాత్సల్యం అమ్మ

సెలవు తీసుకోని పనిమంతురాలు అమ్మ మాతృదేవోభవ.. అమ్మ దేవుడితో సమానం అందరి అమ్మల్లానే మా అమ్మ అంటున్న నిమ్స్ వైద్యుడు హైదరాబాద్: తల్లి గొప్పతనాన్ని చెప్పడానికి ఏ భాషలోనూ పదాలు సరిపోవు. పదాలు తెలియని పె దవులకు అమృత వాత్సల్యం అమ్మ. అమ్మంటే తెలపడానికి భాష చాలడం లేదు. కానీ చెప్పాలన్న ఆశ ఆగడం లేదు. ప్రాణం పోసేది దైవమైతే.. ఆ ప్రాణిని మోసేది మాత్రం అ మ్మే. అందుకే అంటారు ఆమె చల్లని ఒడిలో మొదలైంది […] The post అమృత వాత్సల్యం అమ్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సెలవు తీసుకోని పనిమంతురాలు అమ్మ
మాతృదేవోభవ.. అమ్మ దేవుడితో సమానం
అందరి అమ్మల్లానే మా అమ్మ అంటున్న నిమ్స్ వైద్యుడు

హైదరాబాద్: తల్లి గొప్పతనాన్ని చెప్పడానికి ఏ భాషలోనూ పదాలు సరిపోవు. పదాలు తెలియని పె దవులకు అమృత వాత్సల్యం అమ్మ. అమ్మంటే తెలపడానికి భాష చాలడం లేదు. కానీ చెప్పాలన్న ఆశ ఆగడం లేదు. ప్రాణం పోసేది దైవమైతే.. ఆ ప్రాణిని మోసేది మాత్రం అ మ్మే. అందుకే అంటారు ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ అని. అక్కడ నుంచి మొదలవుతుంది.. సెలవు తీసుకో ని పనిమంతురాలుగా మారిపోతుంది. ఈ లోకంలో నువ్వు ద్వేషించినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మ కమ్మదనం గుర్తించి తెలుసుకుందాం..

నిఘంటువే అమ్మ..

బిడ్డ పలికే కొత్త కొత్త మాటలకు అర్ధ్థాలు కూర్చే నిఘంటువే అమ్మ. అంతేందుకు పదిమందిలో ఒక్కరు. వందలో ఒక్క రు.. కోట్లలో ఒక్కరు.. నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్క రు అమ్మ మాత్రమే. ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్లు ఉన్నారు అంటే అది కేవలం అమ్మ మాత్రమే. ఆ ప్రపంచంలో ఎన్ని బంధాలు ఉన్నా.. మాతృప్రేమలో ఉన్న అనుభూతి ఎక్కడాదక్కదు. ఎంతో గొప్ప బం ధం అమ్మ.అనురాగారానికి అర్ధ్థం అమ్మ.. మమతకు మారుపేరు అమ్మ.. ప్రేమకు ప్రతిరూపం అమ్మ అంటున్నారు ప్ర ముఖ నెఫ్రాలజిస్టు నిమ్స్ హాస్పటల్ నెఫ్రాలజీ డిపార్టుమెం ట్ అధిపతి డా. శ్రీ భూషణ్ రాజు.

అమ్మ గురించి ఆయన మాటలోనే..అందరు అమ్మల్లానే..

అందరు అమ్మల్లాంటిదే మా అమ్మ కూడా. ఒక జీవన పా ఠ్య పుస్తకం. చిన్నప్పుడే చనిపోయిన తండ్రి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆమె కళ్లలో ఒక ఆత్మీయమైన మెరుపును చూ సా. పెంచిన అమ్మమ్మ..తాతయ్యల గురించి గొప్పగా చెప్పే సమయంలో ఒక కృతజ్ఞతాపూర్వకమైన మధుర జ్ఞాపకం.
పదిహేనేళ్లకే సవతి అత్తగారి దగ్గర సజావుగా పనిచేసి మె ప్పించిన నేర్పరి. అయిదుగురు పిల్లలను కని వారి బాగోగులను జాగ్రత్తగా చూసిన ఓర్పరి.

అమ్మతో నా జ్ఞాపకం.

హాస్టల్‌లో అన్నంబాగోలేదు.. అమ్మ.. నాన్నలు లేకుండా నే నుండలేను అని ఇంటికి తిరిగి వచ్చేసిన అన్నయ్యని చదువుకునే వారికి అవన్నీ అవసరం లేదు.. చదువే ప్రధానం అని అర్ధ్థ రాత్రి అన్నయ్యని వెనక్కి పంపించిన అమ్మలో ఒక దా ర్మినికురాలను చూశా.

నాకు అమ్మే స్పూర్తి..

గుమాస్తా పిల్లలు గుమాస్తా అవుతారు కానీ డాక్టర్..ఇంజనీ ర్లు కాలేరు అని నన్ను చిన్నతనంలో వెక్కించారు. అప్పడు మా అమ్మ మీరు ఆ మాటలను నిరూపించాలి అని మాకు బోధించిన తార్మికురాలు. మీ అబ్బాయిని ఇంటర్మీడియేట్ లో తీసుకోమని చెప్పండి అని చెప్పడానికి వచ్చిన మా లె క్కల మాస్టారితో.. నా కొడుకు డాక్టరవుతాడు అని పదో తరగతిలోనే నాకు దిశానిర్దేశం చేసిన మార్గదర్శి. చిన్న కుటుంబాలలో పెద్ద చదువులు కష్టం, మన వల్ల కాదు అన్న నాన్న తో అసాధ్యం కాదన్న అమ్మలో తత్వవేత్తను చూశా.. ఇంట్లో ఆర్ధికపరమైన కష్టాలోచ్చినప్పుడల్లా పోపు డబ్బాల్లోంచి చ టుక్కున దాచుకున్న డబ్బు తీసి సమాయానికి నాన్నని ఆదుకునేది.

ఆర్ధిక మేధావి జీవితాన్ని ప్రేమించడానికి హోదా, పెద్ద చదువు అక్కర్లేదు.. కేవలం ప్రేమించే గుణం ఉంటే చా లు అని నిరూపిస్తున్న నిత్య అధ్యాయని అమ్మ. నా ఆస్తి.. నా పుస్తకాలు అనుకునే సంపూర్ణ శ్రీమంతురాలు మా అమ్మ. ప్రొఫెసర్‌నైనా నాకు ఏ పాఠం చెప్పగలదు.. ఈ ఏడో తరగతి మాత్రమే చదవిన అమ్మ. అమ్మని ఏమి తెలియదు అనుకునే నాకు అమ్మ తెలిసే సరికి సగానికిపైగా జీవితం అ యిపోతుంది.అయినా అమ్మ ఎందుకో నాకు అందరు అ మ్మల్లాంటిదే అనిపిస్తుంది.అమ్మల్లందరు ఇలాగే ఉంటారనిపిస్తుందంటున్నారు డాక్టర్. భూషణ్ రాజు.

mother day 2019

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అమృత వాత్సల్యం అమ్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: