రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి

Mother and Son died in Road Accident

వరంగల్ అర్బన్ : హన్మకొండలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి చెందారు. హన్మకొండ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ విషాదం చోటు చేసుకుంది. మృతుల వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Mother and Son died in Road Accident