విషాదం.. తల్లీ, కొడుకు ఆత్మహత్య..

  మహబూబ్‌నగర్‌: తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఆ తల్లి కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నవాబుపేట మండలం, కొల్లూరు గ్రామంలో తన కుమారుడు చదువు మానేసి, పనిలేకుండా ఖాళీగా తిరుగుతున్నాడని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు […] The post విషాదం.. తల్లీ, కొడుకు ఆత్మహత్య.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మహబూబ్‌నగర్‌: తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఆ తల్లి కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నవాబుపేట మండలం, కొల్లూరు గ్రామంలో తన కుమారుడు చదువు మానేసి, పనిలేకుండా ఖాళీగా తిరుగుతున్నాడని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు ఆత్మహత్యకు పాల్పడడాన్ని జీర్ణించుకోని అతని తల్లి కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విషయం గమనించిన స్థానికులు.. వారి ఇంటికెళ్లి చూడగా.. వేర్వేరు స్థానాల్లో విగతజీవులుగా పడిఉన్నారు. వారు వెంటనే అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. వారిద్దరూ అప్పటికే మరణించినట్లు అంబులెన్స్‌ సిబ్బంది తేల్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, విచారణ చేపట్టారు.

 

Mother and Son commits Suicide

The post విషాదం.. తల్లీ, కొడుకు ఆత్మహత్య.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: