రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృతి

Road Accidentరంగారెడ్డి: శంకర్‌పల్లి మండలం ఎల్వర్తి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి, కూతురు మృతి చెందారు. వీరు ద్విచక్రవాహనంపై వెళుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను  స్వప్న(38), సహస్ర(10)గా గుర్తించారు. శవ పరీక్ష కోసం స్వప్న, సహస్ర మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Mother And Daughter Dead In Road Accident

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.