వృత్తి విద్యకూ ఉంది ఉపకారం!

More jobs in Professional education

వృత్తి విద్యాకోర్సుల్లో చేరి, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నార్త్ సౌత్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ అవకాశాన్ని కల్పిస్తోంది.  విద్యార్థుల మెరిట్, కుటుంబ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఈ ఉపకారవేతనం అందిస్తారు. ఈ ప్రకటన తాజాగా విడుదలైంది. ఇంజినీరింగ్, మెడిసిన్, పాలిటెక్నిక్ కోర్సుల్లో తాజాగా చేరిన విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎఫ్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్కులు, కుటుంబ ఆర్థిక నేపథ్యమే కాకుండా విద్యార్థి దరఖాస్తును బట్టి కొన్ని ప్రత్యేక పరిస్థితులనూ పరిగణనలోకి తీసుకుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో చదివినవారికీ, తాజాగా ప్రభుత్వ కాలేజీల్లో చేరినవారికీ, మొదటి ప్రయత్నంలోనే టాప్ ర్యాంకు సాధించినవారికీ, ఇతర స్కాలర్‌షిప్‌లు పొందనివారికీ ప్రాధాన్యముంటుంది. 

అర్హత: 2018-19 సంవత్సరానికిగానూ వృత్తివిద్యాకోర్సులో చేరినవారు.. పది, ఇంటర్మీడియట్ 85% మార్కులతో పూర్తిచేసుండాలి. డిప్లొమాలో చేరినవారైతే పదో తరగతిలో 80% మార్కులు సాధించివుండాలి.

1. ఇంజినీరింగ్ ప్రవేశపరీక్షలో అయితే 10,000 ర్యాంకు, పాలీసెట్‌లో 5000, నీట్‌లో 60,000, జేఈఈలో 70,000లోపు ర్యాంకులు సాధించి ఉండాలి. ఎయిమ్స్, జిప్‌మర్‌ల్లో ర్యాంకులు సాధించినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

2. ప్రభుత్వ, సంబంధిత ఎయిడెడ్ కాలేజీల్లో ఇంజినీరింగ్, మెడికల్, డెంటల్, వెటర్నరీ, బీఎస్‌సీ నర్సింగ్, బీఎస్‌సీ అగ్రికల్చర్, బీఎస్‌సీ నర్సింగ్, పాలిటెక్నిక్ కోర్సుల్లో సీటు పొంది, ఏ స్కాలర్‌షిప్‌నూ పొందనివారికి ప్రాధాన్యముంటుంది. బీఫార్మా/ డీఫార్మా, బీఏ, బీకాం, బీఎస్‌సీ అభ్యర్థులు అనర్హులు.

3. ప్రైవేటు కాలేజీల్లో చదివినవారైతే పదో తరగతి ఫీజు రూ.15,000, ఇంటర్/ +2లో రూ.30,000 మించి చెల్లించి ఉండకూడదు.
స్కాలర్‌షిప్ మొత్తం: సంవత్సరానికి మెడిసిన్ వారికి రూ.25,000, ఇంజినీరింగ్, డెంటల్, వెటర్నరీ సైన్సెస్, బీఎస్సీ అగ్రికల్చర్ వారికి రూ.20,000, ఇంజినీరింగ్ డిప్లొమా, అగ్రికల్చర్ డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్ వారికి రూ.8000 చెల్లిస్తారు.

4. ముందు సంవత్సరంలో చూపిన ప్రతిభ ఆధారంగానే తరువాతి ఏళ్లలో స్కాలర్‌షిప్‌ను కొనసాగిస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి. https://www.northsouth.org/app6ogin.aspx లింకులో వివరాలను నమోదు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌లో నమోదు పూర్తయ్యాక ప్రింటవుట్ తీసుకోవాలి. ఆ ప్రింటవుట్‌ను అవసరమైన పత్రాలతోపాటు సూచించిన చిరునామాకు పంపాల్సి ఉంటుంది. వీటితోపాటు ఏ స్కాలర్‌షిప్‌నూ పొందడం లేదనే లెటర్‌ను ప్రిన్సిపల్ సంతకంతోపాటు జత చేయాల్సి ఉంటుంది.

తెలంగాణ అభ్యర్థులు.. ఐసీసీ, డి. సీతారామయ్య, 219-220, రెండో ఫ్లోర్, మోడల్ హౌజ్, పంజాగుట్ట, హైదరాబాద్ 500082కి పంపాలి. లేదా -nsf.india2018@northsouth.org కి మెయిల్ చేయొచ్చు.

ఏపీ అభ్యర్థులు… తణుకు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంల్లోని చిరునామాలకు పంపొచ్చు. http://www.northsouth.org/public/india/Andhrapradesh.aspx లింకులో సూచించిన వాటిలో దగ్గర్లోని దానికి పంపడమో, ఈ-మెయిల్ చేయడమో చేయొచ్చు.

ఎంపిక ప్రక్రియ:
దేశంలోని ప్రతి ప్రాంతానికి (చాప్టర్‌కు) ఇండియా చాప్టర్ కోఆర్డినేటర్ (ఐసీసీ) ఉంటారు. వీరి ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ దరఖాస్తులను పరిశీలించి, ఎంపిక చేసినవారిని ఇంటర్వ్యూ చేస్తారు. ఇందులోనూ అర్హత సాధించినవారికి స్కాలర్‌షిప్ అందిస్తారు.
దరఖాస్తు చివరితేదీ: అక్టోబరు 31, 2018
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: www.northsouth.org/ ను చూడవచ్చు.

More jobs in Professional education

Telangana news