బ్యాంకుల ఆస్తుల నాణ్యత క్షీణిస్తోంది

Bank

 

మూడీస్ దృక్పథం నెగెటివ్
భారతీయ బ్యాంకులపై కరోనా వైరస్ ప్రభావం

ముంబై : కరోనా వైరస్ కారణంగా భారతీయ బ్యాంకింగ్ ఆస్తుల నాణ్యత క్షీణిస్తోందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్‌ పేర్కొంది. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ దృక్పథాన్ని నిలకడ నుంచి ప్రతికూలం అంటే స్టేబుల్ నుండి నెగటివ్‌కు మార్చింది. దేశంలో కరో నా మహమ్మారి కారణంగా బ్యాంకుల ఆర్థిక కార్యకలాపాలు మందగించాయని, దీనివల్ల బ్యాంకుల ఆస్తి నాణ్యత మరింత దిగజారిపోయే అవకాశం ఉందని మూడీస్ అభిప్రాయపడింది. కార్పొరేట్లు, చిన్న, మధ్యతరహా సంస్థలు, రిటైల్ వంటి అన్ని విభాగాల లో బ్యాంకుల ఆస్తి నాణ్యత క్షీణిస్తుందని, ఇది బ్యాంకుల ఆదాయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మూడీస్ పేర్కొంది.

కరోనాతో దేశం లో ఆర్థిక కార్యకలాపాల క్షీణత భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో మందగమనాన్ని మరింత పెంచుతుందని సంస్థ తెలిపింది. బ్యాంకులు సమస్య నుంచి బయటపడటానికి ప్రభుత్వం సహాయం చేయాలని పేర్కొంది. ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా క్షీణించడం, నిరుద్యోగం పెరగడం వల్ల, సామాన్య ప్రజలు, సంస్థ లు ఆర్థికంగా భారీగా ప్రభావం పడనుంది. దీంతో డిఫాల్ట్‌కు దారితీస్తుంది. లాభాలు తగ్గడం, రుణ వృద్ధి కారణంగా బ్యాంకుల క్యాపిటలైజేషన్ కూడా ప్రతికూలంగా ప్రభావితమవుతోంది. గత కొన్నేళ్ల మాదిరిగా ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర మరికొంత మూలధనం ఇస్తే కొంత ఉపశమనం పొందవచ్చని మూడీస్ వివరించింది. మూడీస్ మార్చి చివరిలో భారతదేశ జిడిపి వృద్ధి అంచనాను తగ్గించింది. 2020లో భారత జిడిపి వృద్ధి 2.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

Moodys changes outlook on Indian banks

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బ్యాంకుల ఆస్తుల నాణ్యత క్షీణిస్తోంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.