పిల్లి కూనకు అమ్మగా మారిన కోతి

ఆదిలాబాద్ : మూగజీవాలు సైతం మంచి మనస్సుతో స్పందిస్తాయన్న దానికి ఈ ఘటన నిదర్శనంగా చెప్పవచ్చు. ఓ పిల్లికూనను కాకుల బారి నుంచి కాపాడిన ఓ కోతి ఉదంతమిది. ఈ ఘటన నార్నూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో చోటు చేసుకుంది. ఓ పిల్లికూనను కాకుల గుంపు వెంటాడిది. పిల్లికూనను చంపేందుకు కాకుల గుంపు ప్రయత్నించడాన్ని గమనించిన కోతి పిల్లి కూన కోసం కాకులతో పోరాటం చేసింది. అయినప్పటికీ కాకులు ఆ పిల్లికూనను విడిచిపెట్ట లేదు. […] The post పిల్లి కూనకు అమ్మగా మారిన కోతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆదిలాబాద్ : మూగజీవాలు సైతం మంచి మనస్సుతో స్పందిస్తాయన్న దానికి ఈ ఘటన నిదర్శనంగా చెప్పవచ్చు. ఓ పిల్లికూనను కాకుల బారి నుంచి కాపాడిన ఓ కోతి ఉదంతమిది. ఈ ఘటన నార్నూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో చోటు చేసుకుంది. ఓ పిల్లికూనను కాకుల గుంపు వెంటాడిది. పిల్లికూనను చంపేందుకు కాకుల గుంపు ప్రయత్నించడాన్ని గమనించిన కోతి పిల్లి కూన కోసం కాకులతో పోరాటం చేసింది. అయినప్పటికీ కాకులు ఆ పిల్లికూనను విడిచిపెట్ట లేదు. దీంతో సాహసంతో కోతి ఆ పిల్లికూనను తన ఒడిలోకి తీసుకుని, కాకులను దగ్గరకు రానివ్వలేదు. దీంతో కాకుల గుంపు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన స్థానిక ప్రజలను సంబ్రశ్చారాలకు గురి చేసింది.

Monkey Rescued Catkid From Crows

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పిల్లి కూనకు అమ్మగా మారిన కోతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: