సిఎం ఆదేశాలతో కదిలిన మంత్రులు

  స్థానిక నాయకులతో కలిసి మంత్రుల పర్యవేక్షణ ఆగస్మిక తనిఖీలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నియంత్రణ చర్యల్లో పాల్గొంటూ ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలవారిగా నియోజకవర్గాల శాసనసభ్యులను, సానిక ప్రజాప్రతినిధులతో కలిసి బస్తీల్లో పర్యటిస్తూ ప్రజలకు కరోనా నిర్మూలనకు కృషి చేస్తున్నారు. అలాగే పోలీసు అధికారులతో కలిసి బందోబస్తు కార్యక్రమాల్లో పాల్గొంటూ లాక్‌డౌన్ ఉన్నప్పటికీ రహదారులపై […] The post సిఎం ఆదేశాలతో కదిలిన మంత్రులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

స్థానిక నాయకులతో కలిసి మంత్రుల పర్యవేక్షణ
ఆగస్మిక తనిఖీలు
ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నియంత్రణ చర్యల్లో పాల్గొంటూ ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలవారిగా నియోజకవర్గాల శాసనసభ్యులను, సానిక ప్రజాప్రతినిధులతో కలిసి బస్తీల్లో పర్యటిస్తూ ప్రజలకు కరోనా నిర్మూలనకు కృషి చేస్తున్నారు. అలాగే పోలీసు అధికారులతో కలిసి బందోబస్తు కార్యక్రమాల్లో పాల్గొంటూ లాక్‌డౌన్ ఉన్నప్పటికీ రహదారులపై ప్రయాణిస్తున్నవారిని హెచ్చరిస్తున్నారు. మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కరోనా నియంత్రణ చర్యలను పర్యవేక్షించారు. శానిటైజేషన్ పనులు, ప్రజల వ్యక్తిగత పరిశుభ్రత అంశాలను ప్రభుత్వఆదేశాలను ప్రజలు ఖచ్చితం గా పాటించనిపక్షంలో చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.

సత్యవతి రాథోడ్‌తోపాటు ఎంపి మాలో తు కవిత, శాసనసభ్యులు శంకర్‌నాయక్, జిల్లాపరిషత్ ఛైర్మన్ అంగోతు బిందులతో కలిసి బస్తిల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమావేశమయ్యారు. నియోజకవవర్గం పరిధిలో విదేశాలనుంచి వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు. ఎంతమంది స్వీయ నిర్భందంలో ఉన్నారో వారి ఆరోగ్యపరిస్థితులను సమీక్షించారు. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఎట్టిపరిస్థితుల్లో ప్రజలవరూ భయటకు రావద్దని ఆదేశించారు. రోడ్లపైకి వస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని ఆయన చెప్పారు. చేతులు శుభ్రగా ఉంచుకుంటూ మాస్క్‌లు ధరించాలని ఆయన ప్రజలను కోరారు. అనంతరం ఆయన స్థానిక అధికారులు, నాయకులతో కలిసి బస్తీల్లో పర్యటించారు.

కూరగాయలు, ఇతర నిత్యవసరవస్తువులు తీసుకునేటప్పుడు కనీసం మీటరు దూరంలో ఉండాలని సూచించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ, రాష్ట్ర పరిస్థితులదృష్టిలో పెట్టుకుని ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటించాలని చెప్పారు. కరోనా మహమ్మారిని తరిమివేసేందుకు ప్రజలంతా ఖచ్చితమైన ఆరోగ్యసూత్రాలను పాటించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. హసన్‌పర్తి మండలం దేవన్నపేట గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి పర్యటించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తెల్లరేషన్ కార్డున్న పేదలకు ఉచిత బియ్యం సరఫరా చేశారు. మంత్రి ఎర్రబెల్లి తోపాటు స్థానిక శాసన సభ్యుడు అరూరి రమేష్, జిల్లాకలెక్టర్ మున్సిపల్ కమిషనర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.సిద్ధిపేట కలెక్టర్ కార్యాలయంలో కరోనా వైరస్ నియంత్రణ ఏర్పాట్లపై జిల్లాకలెక్టర్ కార్యాలయంలో ఆర్థిక శాఖమంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు.

నియోజకవర్గంలో తీసుకోవల్సిన చర్యలు, లాక్‌డౌన్ పటిష్ఠంగా అమలుచేసేందుకు తీసుకోవల్సిన కార్యక్రమాలు, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏమేరకు కార్యక్రమాలు నిర్వహించాలనే అంశాలపై చర్చించారు. ప్రజలు మాస్క్‌లు ధరించడంతో పాటు సామాజికదూరం పాటించాలని, రోడ్లపైకు రావద్దని, స్వీయనియంత్రణ పాటించాలని హరీష్‌రావు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాండూరులో మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు మహేందర్‌రెడ్డి పర్యటించారు. ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం స్థానిక నాయకులతో సమావేశం ఏర్పాటుచేసి పారిశుధ్ధపనులు సమీక్షించారు. సర్పంచ్‌లకు సూచనలు చేశారు. వ్యక్తి గత దూరం తప్పనిసరిగా పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు,

మార్కెట్‌ను సదర్శించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్‌నగర్ పట్టణంలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పర్యటించి కరోనావైరస్ నియంత్రణ చర్యలపట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనాకట్టడి సందర్భంగా నిత్యవసరవస్తువుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నారు. స్థానిక మెడర్న్ రైతుబజార్‌లో మంత్రి పర్యటించారు. గుంపులు గుంపులుగా ప్రజలు రావద్దని ఆదేశించారు. దూరం పాటించేందుకు బారికేట్లను ఏర్పాటు చేయించారు. అలాగే మహబూబ్‌నగర్ పట్టణప్రజలకోసం 10 సంచార కూరగాయల వాహనాలను ఏర్పాటు చేయించి బస్తీల్లోని ప్రజలకు కూరగాయలను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వం సౌకర్యాలను కల్పిస్తున్నప్పటికీ భయటకు వచ్చి రోడ్లపై తిరిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ధరలు పెంచితే పిడి యాక్ట్ పెడతామని వ్యాపారులను హెచ్చరించారు.

జగదీష్‌రెడ్డి ఆగస్మిక తనిఖీలు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి ఆగస్మిక పర్యటనచేసి ప్రజలను కరోనా నిర్మూలనపై అవగాహన కల్పించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పోచంపల్లి చెక్‌పోస్టువద్ద ఆగస్మిక తనిఖీలు చేశారు. అలాగే చౌటుప్పల్‌లో అమ్మ నాన్న ఆశ్రమాన్ని ఆగస్మికంగా తనిఖీచేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో సరిపడబియ్యం సమకూర్చాలని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా తక్షణం స్పందించిన మంత్రి జగదీష్‌రెడ్డి బోనగిరియాదాద్రి జిల్లాకలెక్టర్‌తో మాట్లాడి 60 క్వింటాళ్ల బియ్యం మంజూరు ఇప్పించారు. అనంతరం చౌటుప్పల్‌లో పారిశుద్ధ పనులను సమీక్షించి రహదారుల్లో అనవసంరంగా ప్రయాణిస్తున్న వారిని హెచ్చరించారు. ఖచ్చితంగా ముఖానికి మాస్క్‌లులేనివారిపై, సమాజిక దూరంపాటించక గుంపులుగుంపులుగా ప్రజలు జమకూడితే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని హెచ్చరించారు. అలాగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎర్రగడ్డరైతుబజార్, యూసుఫ్‌గూడాలో పర్యటించి కరోనాపట్ల ప్రజల్లో అవగాహన కల్పించారు.

లాక్‌డౌన్‌లో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలను పాటించకపోతే కటినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే రాష్ట్ర మంత్రులు జిల్లాలవారిగా కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. శాసనసభ్యులు మైకులద్వారా కరోనా నియంత్రణ పై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు స్థానిక కార్పొరేటర్ నుంచి రాష్ట్ర మంత్రి వరకు. సర్పంచ్ నుంచి జిల్లాపరిషత్ ఛైర్మన్ వరకు కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఒకవైపు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ మరోవైపు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి కరోనా నియంత్రణ చర్యలను సమీక్షిస్తున్నారు.

Monitoring of ministers with local leaders on Corona

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సిఎం ఆదేశాలతో కదిలిన మంత్రులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: