మహేశ్వరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్దరూ. 8లక్షలు చోరీ

Money was stolen

 

మహేశ్వరం : మహేశ్వరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్దే రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన మహిళ చేతి నుంచి 8లక్షల 26వేల రూపాయలు దొంగిలించి పారిపోతున్న దొంగను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కడ్తాల్ మండలం రేఖాతాండకు చెందిన కాట్రావత్ శ్రీను అతని భార్య తులసి భూమి రిజిస్ట్రేషన్ కోసం మహేశ్వరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. భర్త డాక్యుమెంట్ టైపింగ్ చేయిస్తుండగా భార్య తులసి చేతి సంచిలో ఉన్న 8లక్షల 26వేలు రూపాయలను ఒక వ్యక్తి దొంగలించి పారిపోతుండగా ఆమె కేకలు వేసింది తో స్థ్దానికులు వెంబడించి నిందుతుడిని పట్టుకోని దొంగిలించిన నగదుతో సహా పోలీసులకు అప్పగించారు. నిందితుడు కందుకూర్ మండలం మురళీనగర్ గ్రామానికి చెందిన అనిల్‌కుమార్‌గా గుర్తించారు. ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Money was stolen from Woman who came for Registration

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మహేశ్వరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్దరూ. 8లక్షలు చోరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.