ద్విచక్ర వాహనం నుంచి పడిపోయిన డబ్బుల బ్యాగు

  మనతెలంగాణ/మానకొండూర్‌: కరీంనగర్ మానకొండూర్ మండల పరిధిలోని అన్నారం,  పచ్చునూర్ గ్రామాల మద్య ఓ సెల్‌ఫోన్ నెట్‌వర్క్ కంపెనీ కలెక్షన్ బాయ్ ద్విచక్ర వాహనం నుంచి బుధవారం సాయంత్రం డబ్బులు ఉన్న బ్యాగు పడిపోయింది. బాధితుడు రఫీ తెలిపిన వివరాల ప్రకారం.. అన్నారం గ్రామం నుంచి పచ్చునూర్‌కు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా డబ్బులు ఉన్న బ్యాగు వాహనంలో నుంచి కిందపడిపోయినట్లు తెలిపారు. పచ్చునూర్ వెళ్లాక ద్విచక్ర వాహనంలో బ్యాగును చూసుకునే సరికి బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురై […] The post ద్విచక్ర వాహనం నుంచి పడిపోయిన డబ్బుల బ్యాగు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మనతెలంగాణ/మానకొండూర్‌: కరీంనగర్ మానకొండూర్ మండల పరిధిలోని అన్నారం,  పచ్చునూర్ గ్రామాల మద్య ఓ సెల్‌ఫోన్ నెట్‌వర్క్ కంపెనీ కలెక్షన్ బాయ్ ద్విచక్ర వాహనం నుంచి బుధవారం సాయంత్రం డబ్బులు ఉన్న బ్యాగు పడిపోయింది. బాధితుడు రఫీ తెలిపిన వివరాల ప్రకారం.. అన్నారం గ్రామం నుంచి పచ్చునూర్‌కు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా డబ్బులు ఉన్న బ్యాగు వాహనంలో నుంచి కిందపడిపోయినట్లు తెలిపారు. పచ్చునూర్ వెళ్లాక ద్విచక్ర వాహనంలో బ్యాగును చూసుకునే సరికి బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురై తిరిగి వెనక్కి వచ్చినా బ్యాగు దొరకలేదు. అందులో రూ.1 లక్షా 47 వేలు ఉన్నట్లు బాధితుడు తెలిపారు. బ్యాగులో డబ్బుతో పాటు గుర్తింపు కార్డు ఉన్నట్లు తెలిపాడు. డబ్బుల బ్యాగు దొరికిన వారు తిరిగి అప్పగించినట్లయితే తగిన పారితోషికం ఇవ్వడం జరుగుతుందన్నాడు. ఈ సంఘటనపై బుధవారం రాత్రి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు రఫీ తెలిపాడు.

 

 

Money Bag Missing from Bike in Travel in Manakondur

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ద్విచక్ర వాహనం నుంచి పడిపోయిన డబ్బుల బ్యాగు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.