అమ్మతో పెళ్లి గురించి మాట్లాడేదాన్ని: జాన్వీ కపూర్

  దివంగత నటి శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతోనే ఆకట్టుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. దీంతో మీడియా కన్ను జాన్వీపై పడింది. ఈ బ్యూటీ ఏం చేసినా… ఎటు వెళ్లినా మీడియా క్లిక్ మనిపిస్తుంది. దీంతో జన్వీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. ప్రస్తుతం కార్గిల్ గాళ్‌‌, రూహీ అఫ్జా, తఖ్త్‌‌, దోస్తానా 2 ఇలా వరుసగా సినిమాలతో బిజీగా ఉంది […] The post అమ్మతో పెళ్లి గురించి మాట్లాడేదాన్ని: జాన్వీ కపూర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దివంగత నటి శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతోనే ఆకట్టుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. దీంతో మీడియా కన్ను జాన్వీపై పడింది. ఈ బ్యూటీ ఏం చేసినా… ఎటు వెళ్లినా మీడియా క్లిక్ మనిపిస్తుంది. దీంతో జన్వీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. ప్రస్తుతం కార్గిల్ గాళ్‌‌, రూహీ అఫ్జా, తఖ్త్‌‌, దోస్తానా 2 ఇలా వరుసగా సినిమాలతో బిజీగా ఉంది ఈ యంగ్ బ్యూటీ. తాజాగా ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లితో ప్రేమానుబంధాన్ని గుర్తు చేసుకుంది జాన్వీ. తాను అమ్మతో అబ్బాయిల గురించి చర్చించేదాన్నని, పెళ్లి గురించి మాట్లాడేదాన్నని చెప్పింది. అయితే, అబ్బాయిల విషయంలో అమ్మ తనను అస్సలు నమ్మేదికాదని, తాను ఇతరులను చాలా త్వరగా ప్రేమించేస్తుండడంతో అమ్మే తనకు ఒక మంచి అబ్బాయిని సెలక్ట్ చేయాలనుకుందని తెలిపింది.

మీకు ఎలాంటి భర్త కావాలని అడగగా.. తనకు కాబోయే భర్త తెలివైన వాడై ఉండాలని, తానేం చేస్తున్నాడో దానిపై అంకితభావం ఉండాలని.. ముఖ్యంగా అతడి నుంచి తాను నేర్చుకునేలా ఉండాలని చెప్పింది. అన్నింటికన్నా తనను ఎక్కువగా ఇష్టపడాలని, హస్యా చతురత కూడా ఉండాలని తనకు కాబోయే భర్త గురించి వివరించింది. ఇక, తన పెళ్లి సాంప్రదాయ బద్ధంగా తిరుపతిలో జరుగుతుందని, పెళ్లిలో తాను కాంచీపురం చీరను ధరిస్తానని, తనకిష్టమైన దక్షిణాది వంటకాలతో భోజనం ఉంటుందని జాన్వీ చెప్పుకొచ్చింది.

 

Mom does not trust me in guys: Jahnvi Kapoor

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అమ్మతో పెళ్లి గురించి మాట్లాడేదాన్ని: జాన్వీ కపూర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.