గృహహింస కేసు…బెయిల్ కోసం షమీ ప్రయత్నాలు!

న్యూఢిల్లీ: గృహహింస కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో భారత స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ బెయిల్ ప్రయత్నాలు ప్రారంభించాడు. గృహ హింస ఆరోపణలు ఎదుర్కొంటున్న షమీపై కోల్‌కతాలోని అలిఫోర్ కోర్టు గత సోమవారం అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, వెస్టిండీస్ టూర్ సందర్భంగా అమెరికా వెళ్లిన షమీ అక్కడి నుంచే బెయిల్ కోసం తన లాయర్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. షమీ అమెరికాలో ఉండిపోవడంపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందిస్తూ.. […] The post గృహహింస కేసు… బెయిల్ కోసం షమీ ప్రయత్నాలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


న్యూఢిల్లీ: గృహహింస కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో భారత స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ బెయిల్ ప్రయత్నాలు ప్రారంభించాడు. గృహ హింస ఆరోపణలు ఎదుర్కొంటున్న షమీపై కోల్‌కతాలోని అలిఫోర్ కోర్టు గత సోమవారం అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, వెస్టిండీస్ టూర్ సందర్భంగా అమెరికా వెళ్లిన షమీ అక్కడి నుంచే బెయిల్ కోసం తన లాయర్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. షమీ అమెరికాలో ఉండిపోవడంపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందిస్తూ.. ‘వెస్టిండీస్ పర్యటన ముగించుకున్న షమీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. సెప్టెంబర్ 12న షమీ భారత్‌కు తిరిగి రానున్నాడని, అంతవరకు తన లాయర్ సలీమ్ రెహమాన్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాడని ఆ అధికారి వివరించాడు. కోర్టు షమీపై వేసిన చార్జ్‌షీట్‌ను పరిశీలించేవరకు బోర్డు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోదని‘ అతను స్పష్టం చేశాడు.

మహ్మద్ షమీ తనను వేదిస్తున్నాడంటూ గత ఏడాది మార్చిలో అతని భార్య హసీన్ జహాన్ కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో గతేడాది కొద్ది రోజుల పాటు బీసీసీఐ షమీ కాంట్రాక్ట్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా విచారణ నిమిత్తం షమీ న్యాయస్థానానికి హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు.. షమీకి అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ 15 రోజుల్లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్ వారెంట్ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం షమీ తన ప్రయత్నాలను ముమ్మరం చేశాడు.

Mohammed shami plans for Bail in arrest warrant case

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గృహహింస కేసు… బెయిల్ కోసం షమీ ప్రయత్నాలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: