కశ్మీర్‌లో అంతర్జాతీయ సదస్సు

Jammu-Kashmir

జమ్మూ: జమ్మూ, కశ్మీర్ అభివృద్ధికి ఆటంకంగా నిలిచాయంటూ ఆర్టికల్ 370, 35అధికరణను రద్దు చేసిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రాంత అభివృద్ధి కోసం చకచకా అడుగులు వేస్తోంది. కశ్మీరీల తలరాతలు మారబోతున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన కొద్ది రోజులకే రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించడం కోసం రంగం సిద్ధం చేసింది. వచ్చే అక్టోబర్ 12నుంచి మూడు రోజుల పాటు శ్రీనగర్‌లో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ చైదరి మంగళవారం జమ్మూలో చెప్పారు. ఇది నిజంగా జమ్మూ కశ్మీర్ ప్రజలకు ముఖ్యంగా యువతకు ఆనందాన్ని కలిగించే వార్తేనని చెప్పవచ్చు. అక్టోబర్ 12నుంచి 14 వరకు ఈ సదస్సు జరుగుతుందని చౌదరి చెప్పారు. జమ్మూ, కశ్మీర్‌లో నిర్వహించే మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సు ఇదేనని ఆయన చెప్పారు. సదస్సు ప్రారంభ సమావేశం అక్టోబర్ 12న శ్రీనగర్‌లో జరుగుతుందని ఆయన చెప్పారు. భారత పరిశ్రమల సమాఖ్య(సిఐఐ) ఈ సదస్సుకు జాతీయ భాగస్వామిగా ఉంటుంది. దీనికి సంబంధించి సిఐఐ, జమ్మూ, కశ్మీర్ వాణిజ్య ప్రోత్సాహక మండలి ( జెకెటిపిఓ) మధ్య ఒక అవగాహనా ఒప్పందం కుదిరినట్లు కూడా చౌదరి చెప్పారు. వ్యాపారవేత్తలు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ముడి సరకులు, మౌలిక సదుపాయాలు, స్కిల్డ్, అన్‌స్కిల్డ్ కార్మికుల లభ్యత, రాష్ట్ర ప్రభుత్వ విధానాల గురించి స్వయంగా తెలుసుకోవడానికి ఈ అంతర్జాతీయ సదస్సు దోహదపడుతుందన్నారు.

Modi govt scraps Article 370 and 35A in Jammu Kashmir

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కశ్మీర్‌లో అంతర్జాతీయ సదస్సు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.